Bigg Boss Grand Finale: అన్నపూర్ణ స్టూడియో వద్ద భద్రత కట్టుదిట్టం-పోలీసుల మోహరింపు...!!

Bigg Boss Grand Finale: బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో అభిమానుల హంగామాను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2021, 07:14 PM IST
  • అన్నపూర్ణ స్టూడియో వద్ద భద్రత కట్టుదిట్టం
  • బిగ్‌బాస్ షో గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో స్టూడియో వద్ద పోలీస్ బలగాలు
  • ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల మోహరింపు
Bigg Boss Grand Finale: అన్నపూర్ణ స్టూడియో వద్ద భద్రత కట్టుదిట్టం-పోలీసుల మోహరింపు...!!

Bigg Boss Grand Finale: బిగ్‌బాస్ వీక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫినాలే రానే వచ్చేసింది. మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్ విన్నర్ (Bigg Boss 5 Winner) ఎవరనేది తేలిపోనుంది. సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్, మానస్, సిరి... ఈ ఐదుగురిలో ఒకరు విజేతగా నిలవనున్నారు. సన్నీ ఫ్యాన్స్ అయితే అతనే విన్నర్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలె (Bigg Boss 5 Telugu) నేపథ్యంలో అభిమానుల హంగామాను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

స్టూడియో వద్దకు (Annapurna Studio) అభిమానులు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉండటంతో... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బలగాలను మోహరిస్తున్నారు. గతంలో తమ అభిమాన కంటెస్టెంట్లు గెలవలేదనే బాధతో కొంతమంది అభిమానులు గొడవలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఘటనలు రిపీట్ అవకుండా అభిమానులను అదుపు చేసేందుకు భద్రతను పెంచినట్లు చెబుతున్నారు.

ఇక ఈసారి బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలెను (Bigg Boss) అత్యంత గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఫైనల్ షోలో టాలీవుడ్, బాలీవుడ్ తారలు సందడి చేయనున్నారు. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, రష్మిక మందనా, దేవీశ్రీ ప్రసాద్, సాయిపల్లవి, కృతిశెట్టి, నాని, దర్శకులు సుకుమార్, రాజమౌళి షోకి గెస్టులుగా రానున్నారు. ఇంతమంది స్టార్స్ బిగ్‌బాస్ స్టేజీ పైకి రానుండటంతో షో మరింత అట్రాక్షన్‌ను సంతరించుకోనుంది.

Also Read: Guntur: బొడ్డు పేగు తిని వివాహిత మృతి-సంతానం కలుగుతుందన్న మూఢనమ్మకంతో...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News