Krishnamma OTT: ఏడు రోజులకే ఓటీటీలోకి.. తెలుగు సినిమాలలో ఇలా మొదటిసారి!

Satyadev Krishnamma: కొరటాల శివ సమర్పణలు సత్యదేవ హీరోగా వచ్చిన సినిమా కృష్ణమ్మ. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అప్పుడే ఓటీటీలోకి రావడం తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిస్తోంది. వివరాల్లోకి వెళితే..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 17, 2024, 08:21 AM IST
Krishnamma OTT: ఏడు రోజులకే ఓటీటీలోకి.. తెలుగు సినిమాలలో ఇలా మొదటిసారి!

Krishnamma OTT: ఒకప్పుడు సినిమాలు థియేటర్స్ లో సంవత్సరం కొద్ది ఆడేవి. అది కొంచెం క్రమంగా తగ్గుతూ డైమండ్ జూబ్లీ కాస్త సిల్వర్ జూబ్లీకి వచ్చింది. అంటే సినిమాలు 175 రోజులు లేదా వంద రోజులు థియేటర్స్ లో ఆడుతూవచ్చాయి. కానీ కరోనా తర్వాత ఈ ట్రెండ్ మొత్తం మారిపోయింది. మనుషుల జీవితాల్లోనే కాదు సినిమాల్లో కూడా కరోనాకాలం ఎంతో మార్పులు తీసుకొచ్చింది. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ ఎక్కువ అవ్వడంతో.. స్టార్ హీరో సినిమాలు సైతం నెలకొంత టీవీలో వచ్చి కూర్చుంటున్నాయి.

అందుకే కలెక్షన్స్ 10 రోజుల్లో తెచ్చుకుంటే సరి. ఆ తరువాత సినిమాకి కలెక్షన్స్ వస్తాయన్న నమ్మకాలు నిర్మాతలకి కూడా ఉండడం లేదు. అందుకే ఓటిటీ వాళ్ళకి తమ సినిమాలను త్వరగా డిజిటల్ స్ట్రీమింగ్ చెయ్యడానికి అంగీకారం కుదుర్చుకొని.. ఎక్కువ డబ్బులకు అమ్మేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్య సినిమాలు అన్నీ 20 రోజుల పైన డిజిటల్ స్ట్రీమింగ్ మొదలుపెడుతున్నాయి. ఈ క్రమంలో ఒక సినిమా మాత్రం రిలీజ్ అయిన ఏడు రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ మొదలుపెట్టి అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వేడి ఉండటంతో.. సినిమా థియేటర్లో విలవిల పోతున్నాయి అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విడుదలైన సత్యదేవ కృష్ణమ్మ సినిమా.. ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించుకున్న.. ఎక్కువమంది జనాలని థియేటర్స్ కి అయితే తీసుకురాలేకుండా పోయింది.

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో. సత్యదేవ్ హీరోగా దర్శకుడు వివి గోపాలకృష్ణ ఈ సినిమాని తెరకెక్కించారు. మరి ఓ రస్టిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం కేవలం వారం వ్యవధిలోనే ఓటిటిలో వచ్చేసి షాకిచ్చింది. నేటి నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి వచ్చేసింది. కాగా ఈ సినిమా వారంలోనే బ్రేక్ ఈవెన్ అయిపోవడంతో.. ఇక నిర్మాతలు.. ఓటిటి నుంచి వచ్చే కొద్ది మొత్తం కూడా వారికి ప్లస్ అవుతుంది అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్.. నిలిచిపోయిన వాహనాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News