Animal First Look : క్రూరమైన 'యానిమల్‌..' అర్జున్ రెడ్డిని మించేలా.. చించేసిన సందీప్ రెడ్డి వంగా

Animal First Look అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క సారిగా హాట్ టాపిక్ అయ్యాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అదే సినిమాను కబీర్ సింగ్     అంటూ హిందీలో తీసి వందల కోట్లు కొల్లగొట్టేశాడు. ఇప్పుడు యానిమల్ అంటూ రాబోతోన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2023, 01:17 PM IST
  • మార్క్ చూపించిన సందీప్ రెడ్డి వంగా
  • అర్జున్ రెడ్డి, కబీర్‌ సింగ్‌లతో రికార్డులు
  • యానిమల్ అంటూ మరోసారి సందడి
Animal First Look : క్రూరమైన 'యానిమల్‌..' అర్జున్ రెడ్డిని మించేలా.. చించేసిన సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga Animal అర్జున్ రెడ్డి సినిమాను నిర్మించేందుకు, తెరకెక్కించేందుకు సందీప్ రెడ్డి వంగా ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. కథను ఎవ్వరూ నమ్మకపోవడం,పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో.. అర్జున్ రెడ్డి సినిమాను సందీప్ రెడ్డి వంగానే నిర్మించాడు. చివరకు అది కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచింది. ఒక్కసారిగా టాలీవుడ్‌ను యూటర్న్ తిప్పేసింది. మేకింగ్ విషయంలో మార్పులను తీసుకొచ్చింది.

ఒకప్పుడు శివ ఇప్పుడు అర్జున్ రెడ్డి అనే రేంజ్‌లో హిట్టు కొట్టేశాడు సందీప్ రెడ్డి వంగా. పాత్ బ్రేకింగ్ సినిమాలా నిలిచిపోయింది అర్జున్ రెడ్డి. తెలుగులో ఈ సినిమా విజయాన్ని చూసి బాలీవుడ్ సైతం కుళ్లుకుంది. దీంతో సందీప్ రెడ్డి వంగా అక్కడ కబీర్ సింగ్ అంటూ షాహిద్ కపూర్‌తో హిట్ కొట్టేశాడు. దీంతో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయాడు. అందుకే అక్కడే రణ్‌బీర్ కపూర్, రష్మిక మందనలతో కలిసి యానిమిల్ అనే సినిమాను ప్రారంభించాడు.

 

ఈ ఏడాది రాబోతోన్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో సినిమా మీద అంచనాలు పెంచేశాయి. యానిమల్ అంటే జంతువు, మృగం అని అర్థం. దానికి తగ్గట్టే.. క్రూరమైన మృగంలా కనిపించేలా లుక్‌ను డిజైన్ చేశాడు. గొడ్డలి పట్టుకుని నరికి నరికి రక్తం తడిసిపోయినట్టు లుక్ కనిపిస్తోంది.

మొత్తంగా రగ్డ్ లుక్‌లో రణ్‌బీర్ కపూర్‌ను చూసిన ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒక వేళ యానిమల్ హిట్ అయితే.. మళ్లీ బాలీవుడ్ బౌన్స్ బ్యాక్ అయినట్టే అని సౌత్ జనాలు అంటున్నారు. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ఆగస్ట్ 11న రిలీజ్ చేయబోతోన్నారు.

Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News