Sandalwood Drug Case: నటి సంజన అరెస్ట్

కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే క్రైం బ్రాంచ్ పోలీసులు నటి రాగిణి ద్వివేది (Actress Ragini Dwivedi) ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

Last Updated : Sep 8, 2020, 03:23 PM IST
Sandalwood Drug Case: నటి సంజన అరెస్ట్

Kannada actress Sanjjana Garlani arrested: బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. శాండల్‌వుడ్‌ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే క్రైం బ్రాంచ్ పోలీసులు నటి రాగిణి ద్వివేది (Actress Ragini Dwivedi) ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి సంజనా గల్రానికీ కూడా డ్రగ్స్ సప్లయర్స్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రాగా.. దానిని సంజనా ఖండించింది. అయితే తాజాగా మంగళవారం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కన్నడ నటి సంజన గల్రాని (Sanjjana Garlani) ఇంట్లో సోదాలు నిర్వహించి ఆమెను విచారణ నిమిత్తం అరెస్టు చేశారు. బెంగళూరులోని ఆమె నివాసంలో సోదాలు చేసిన అనంతరం బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Also read: Sandalwood Drug Case: నటి రాగిణి ద్వివేదిని అదుపులోకి తీసుకున్న క్రైమ్ బ్రాంచ్

ఈ కేసులో నిందితుడైన సంజన స్నేహితుడు.. రాహుల్‌ శెట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమె నివాసంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో మొత్తం 13 మందిపై కేసు నమోదు చేయగా.. సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు. Also read: Sanjjana Garlani: డ్రగ్ డీలర్స్‌తో సంబంధాలు వార్తలపై స్పందించిన సంజన

Trending News