Samantha visits Palani: ప్రముఖ ఆలయానికి సమంత..మెట్టుమెట్టుకూ కర్పూరం వెలిగించి మొక్కు చెల్లింపు!

Samantha Public Appearance:  మయోసైటిస్ బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత ఇప్పుడు తాజాగా పబ్లిక్ లో కనిపించింది, ఆమె తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించింది, ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 14, 2023, 04:32 PM IST
 Samantha visits Palani: ప్రముఖ ఆలయానికి సమంత..మెట్టుమెట్టుకూ కర్పూరం వెలిగించి మొక్కు చెల్లింపు!

Samantha Prays Palani Murugan: సమంత రూత్ ప్రభు విడాకులు తీసుకున్న తర్వాత నుంచి ప్రతి చిన్న విషయంలోనూ హైలైట్ అవుతోంది. ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా, అది మీడియాలో సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. ఇక ఈ మధ్యకాలంలోనే తాను మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్న ఆమె తాజాగా ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొంతవరకూ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.

అయితే ఆమె తమిళనాడులోని పళని మురుగన్ ఆలయానికి వెళ్ళింది.  తమిళనాడులోని ప్రజలందరూ పళని మురుగన్ ను కొంగుబంగారంగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన దగ్గర మొక్కుకున్న ఏ మొక్కైనా, వెంటనే తీర్చేస్తాడని అక్కడి వారందరూ నమ్ముతూ ఉంటారు. అయితే సమంత ఏం మొక్కుకుందో తెలియదు గానీ ఆలయంలో ఉన్న 600 మెట్లు ఎక్కుతూ ప్రతి మెట్టుకు కర్పూరంతో హారతి వెలిగించింది. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు సేవించింది.  

ఆమె వెంట దర్శకుడు ప్రేమ్ కుమార్ తో పాటు మరికొంతమంది తమిళ నటీమనులు ఉన్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె హీరోయిన్గా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కావాల్సి ఉంది, అయితే ఆ సినిమాను అనేక కారణాలతో వాయిదా వేశారు. ఇ ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సినిమా యూనిట్ ప్రకటించింది.

ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి ఎందుకు వాయిదా పడిందా అనే విషయం మీద చర్చ జరుగుతుంది. మరోపక్క సమంత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. సమంత కారణంగానే ప్రస్తుతానికి ఆ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. త్వరలోనే సమంత షూటింగ్ కి హాజరైతే ఆ సినిమా షూటింగ్ ప్రారంభమై విడుదలకు సిద్ధం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ సినిమా షూటింగ్ ఎగ్గొట్టిన సమంత ఆ మధ్య ముంబై వెళ్లి సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొంది.

Also Read: OTT movies this week: ఒటీటీలో సందడి చేయబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాలివే!

Also Read: Bandla Ganesh Tweets: మీరు వండర్ ఫుల్, మీరే ఇండియా ఫ్యూచర్ కేసీఆర్.. బండ్లన్న ట్వీట్ల వర్షం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News