Samantha Viral Video: ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి .ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారం జోరు తో పాటు హడావిడి కూడా కనిపిస్తోంది. ప్రచారాలకి సినీ సెలబ్రిటీలను కూడా తెగ వాడేస్తున్నారు రాజకీయ నేతలు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ బ్యూటీ సమంత అంటే ఎంత క్రేజో అందరికీ తెలుసు. కాంట్రవర్సీస్ కి చాలా వరకు దూరంగా ఉండే సమంత ఒక అభ్యర్థిని సపోర్ట్ చేస్తూ ఓటు వేయండి అంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలు అభివృద్ధికి మీ ఓటు కాబట్టి సైకిల్ కి ఓటు వెయ్యండి సమంత చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. సమంత టీడీపీకి సపోర్ట్ చేస్తున్న అంటూ ఎంతోమంది కామెంట్లు పెట్టేసాగారు. అంతేకాకుండా ఇది ఇప్పుడే సమంత షేర్ చేసిన వీడియో అండ్ సోషల్ మీడియా వాళ్ళు తెగ ప్రచారం అవుతోంది.
అయితే ఈ వీడియో ఈ ఎన్నికలకు సంబంధించింది కాదు. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో సమంత సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో తిరిగి మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ పోస్ట్ పెట్టే సమయానికి సమంత ఇంకా అక్కినేని ఇంటి కోడలే.. మామ నాగార్జున ఒకపక్క పరోక్షంగా వైసీపీకి సపోర్ట్ ఇస్తుంటే ఇలా సమంత టిడిపిని సపోర్ట్ చేయడం ఏమిటి అంటూ అప్పట్లో తెగ చర్చలు జరిగాయి.
అంతేకాదు ఇప్పుడు సమంత అసలు ఆ వీడియో ఎందుకు షేర్ చేసింది అంటే.. టిడిపి రేపల్లె అభ్యర్థి కోసం. అందుకే అప్పట్లో అసలు ఈ రేపల్లె అభ్యర్థి ఎవరు? పనిగట్టుకొని మరి సమంత ఇతనికి ఓటు వేయండి అంటూ ప్రచారం చేయడం ఏమిటి? అసలు ఇద్దరికీ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి ?అంటూ సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడిచింది. వీటికి స్పందిస్తూ సమంత ‘ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్.. వ్యక్తిగతంగా నేను అతనికి సపోర్ట్ చేస్తున్నాను. నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నాకు ఆయన సోదరి డాక్టర్ మంజులతో బాగా పరిచయం ఉంది.’అంటూ సమాధానం కూడా ఇచ్చింది. అయితే మళ్లీ అప్పటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.
Thank you Samantha !! ❤️🔥
Vote for 🚲
Vote for Development 🥁Yours Sam pic.twitter.com/ni3CdQy2bH
— . (@BaadshahRuler) February 27, 2024
ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియో చూసి అందరూ ఇది రాబోయే ఎన్నికలకు సంబంధించిన అని అనుకుంటున్నారు. 2019లో జరిగిన ఎన్నికలలో రేపల్లె నియోజకవర్గం నుంచి అనగాని సత్యప్రసాద్ గెలుపొందారు. ఆయన ఆ ప్రాంతం నుంచి వరుసగా ఇప్పటికే మూడుసార్లు గెలిచారు. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఆయనకే టిడిపి తరఫున సీటు ఇచ్చారు.అయితే ఈ పాత వీడియో ఇప్పుడు సరికొత్తగా మరొకసారి వైరల్ అయింది. ఇలా పాత వీడియోలు వైరల్ అవ్వడం కొత్త విషయం ఏమి కాదు. కాకపోతే ఇలా జరగడం పలు రకాల కన్ఫ్యూషన్ కి దారితీస్తుంది.
Also Read: Kuppam: చంద్రబాబును ఓడించండి.. కుప్పం అభివృద్ధి చేసుకుందాం: సీఎం జగన్ పిలుపు
Also Read: Floating Bridge: లేదు లేదు 'తేలియాడే వంతెన' కొట్టుకుపోలే.. మేమే దాన్ని విడదీశాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి