Samantha: 'పెళ్లి గురించి తొందరొద్దు.. చదువు నేర్పించండి, ఆత్మ స్థైర్యం పెంచండి'- సమంత ఇన్​స్టా స్టోరీ

Samantha: ఆడ పిల్లల పెళ్లి గురించి ఆందోళన పడకుండా.. తల్లిదండ్రుల ఎలా వ్యవహరించాలని సూచించే ఓ పోస్ట్​ను షేర్ చేశారు నటి సమంత. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింటా వైరల్​గా మారింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 05:01 PM IST
  • పెళ్లి గురించి సమంత ఆసక్తికర ఇన్​స్టా స్టోరీ
  • ఆడపిల్లల తల్లిదండ్రులకు కీలక సూచనలు
  • ఇటీవలే విడాకులు తీసుకున్న నటి
Samantha: 'పెళ్లి గురించి తొందరొద్దు.. చదువు నేర్పించండి, ఆత్మ స్థైర్యం పెంచండి'- సమంత ఇన్​స్టా స్టోరీ

Samantha on marriage : ప్రముఖ నటి సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. పెళ్లి గురించి ఆమె చేసిన (Samantha on marriage) ఓ పోస్ట్ ఇందుకు కారణం.

ఆడపిల్లల తల్లిదండ్రులు కూతురు పెళ్లి కోసం తొందర పడకుండా.. వారిని ఎలా పెంచాలి? ఎలాంటి విషయాలను నేర్పించాలని అనే వివరాలతో (Samanth latest news) కూడిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది.

ఇంతకీ ఆ పోస్ట్​లో ఏముందంటే..

'ఆడపిల్లలను వారి పెళ్లి గురించి దిగులు పడకుండా.. ఆమెను శక్తిమంతగా తీర్చిదిద్దండి. పెళ్లి కోసం డబ్బులు దాయడానికి బదులు.. చదువుపై ఖర్చు చేయండి. ఇంకా ముఖ్యమైన విషయమేమిటంటే.. ఆమెను పెళ్లికోసం సిద్ధం చేయడానికి బదులు.. సొంతంగా తనంతట తాను బతికేలా చూడండి. తనను తాను ప్రేమించుకునేలా, ఎలాంటి పరిస్థితులైననా ఎదుర్కొనేలా ఆత్మ స్థైర్యాన్ని ఆమెలో పెంపొందించండి.' అంటూ ఆడపిల్లల తల్లి డండ్రులకు సూచించేలా ఈ పోస్ట్ ఉంది.

అయితే నిజానికి ఈ పోస్ట్​ను సమంత నేరుగా చేయలేదు.  భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌​ (Rani rampal) ఈ పోస్ట్​ చేయగా.. దానినే తన ఇన్​స్టా పేజీ స్టోరీలో పెట్టారు సమంత. సమంత షేర్​ చేసిన తన పోస్ట్​ను రాణీ రాంపాల్​ కూడా తన తిరిగి ఇన్​స్టా స్టోరీలో పెట్టుకోవడం విశేషం.

Also read: Radhe Shyam Pooja Hegde teaser: దీపావళి రోజే రాధే శ్యామ్ పూజా హెగ్డే టీజర్ ?

also read: SVP shooting: సర్కారు వారి పాట షూటింగ్‌లో కీర్తి సురేష్‌తో Namrata Shirodkar

విడాకుల తర్వాత కొత్త జీవితం..

నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ సమంత-నాగచైతన్య ఇటీవలే (Samanth divorce) విడిపోయారు. పరస్పరం అంగీకారంతో, అన్ని విధాలుగా చర్చించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమంత, నాగ చైతన్య ప్రకటించారు. పదేళ్లుగా తమ స్నేహం స్నేహం కొనసాగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. భార్యా, భర్తలుగా విడిపోయినా.. తమ మధ్య స్నేహం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

విడాకుల తర్వాత సమంత, నాగ చైతన్య తమ తమ వ్యకిగత పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. నాగ చైతన్య షూటింగ్స్​లో పాల్గొంటుండగా.. సమంత తీర్థ యాత్రలు చేస్తున్నారు.

Also read: Bangarraju release date: బంగార్రాజు రిలీజ్ డేట్ ఫిక్స్ ? Bheemla Nayak తో క్లాష్ తప్పదా ?

కోర్టులో ఊరట..

ఇదిలా ఉండగా.. తమ విడాకులపై అభ్యంతరకరంగా వార్తలు రాసిన యూట్యూబ్​ ఛానెళ్లపై కూకట్​పల్లి కోర్టులో పిటిషన్​ దాఖలు చేసిన సమంతకు మంగళవారం ఊరట లభించింది. ఆమె ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్న వీడియోలను వెంటనే తొలగించాలని ఆయా యూట్యూబ్ ఛానెళ్లను కోర్టు ఆదేశించింది. అదే విధంగా వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని కోర్టు సమంతకు స్పష్టం చేసింది.

Also read: Manchu Manoj: మనోజ్‌ రెండో పెళ్లి..నన్ను కూడా పిలవండంటూ మంచు హీరో సెటైర్!

Also read: Jr NTR: సంజయ్‌ లీలా భన్సాలీతో జూ. ఎన్టీఆర్‌ మూవీ..ఇక ఫ్యాన్స్ కు పండగే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News