Samantha Beast Mode : బీస్ట్ మోడ్‌లో సమంత.. వర్కౌట్లు వైరల్

Samantha Beast Mode Workout సమంత ప్రస్తుతం బీస్ట్ మోడ్‌లోకి మారిపోయింది. మయోసైటిస్ నుంచి సమంత పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. సమంత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆల్రెడీ సమంత ముంబైకి షిఫ్ట్ అయినట్టుగా టాక్.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2023, 06:43 PM IST
  • ఫుల్ ఫాంలోకి వచ్చిన సమంత
  • బీస్ట్ మోడ్‌ లుక్కులో సామ్
  • సమంత వర్కౌట్లు వైరల్
Samantha Beast Mode : బీస్ట్ మోడ్‌లో సమంత.. వర్కౌట్లు వైరల్

Samantha Beast Mode Workout సమంత ప్రస్తుతం రెట్టింపు బలం, వేగంతో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా గత ఆరేడు నెలలు మంచానికే పరిమితమైంది. ఇంటి నుంచి బయటకు రాలేదు. కనీసం తన ఫోటోను కూడా షేర్ చేయలేదు. అలా మయోసైటిస్ వల్ల సమంత ఎంతగానో బాధపడింది. సినిమాలను ఆపేసుకుంది. కొత్త సినిమాలను క్యాన్సిల్ చేసుకుంది. అలా ఒంటరిగానే తన కష్టాన్ని భరించుకుంది. ఇప్పుడు సమంత తన సత్తాను చాటుతోంది.

సమంత రెట్టింపు బలంతో ఇప్పుడు తిరిగి వచ్చింది. ఆ విషయాన్ని ఆమె చేస్తోన్న వర్కౌట్లు చూస్తే అర్థం అవుతోంది. సమంత ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయిందని టాక్. పదిహేను కోట్లతో సమంత ముంబైలో ఓ ఇళ్లు కొనేసింది. ఇకపై అక్కడే ఉంటుందట. అసలే రాజ్ అండ్ డీకే వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ కోసం ఆమె ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కడికే మకాం షిఫ్ట్ చేసినట్టుగా టాక్.

సమంత ఇప్పుడు బీస్ట్ మోడ్‌లోకి మారిపోయింది. వర్కౌట్లు చేస్తూ తనని తాను ధృడంగా మల్చుకుంటోంది. ఇక ఆమె వర్కౌట్లు చూసి అంతా ఫిదా అవుతున్నారు. సమంత ఇప్పుడు మనుపటిలా మారిపోతోంది. వంద కేజీల బరువు ఎత్తిన మునుపటి సమంత తిరిగి వచ్చేట్టుగానే కనిపిస్తోంది.

ఒకప్పుడు అయితే అత్త అమల, మామ నాగ్, భర్త చైతన్యలతో పోటీ పడుతూ సమంత వర్కౌట్లు చేసేది. ఇలా అందరూ జిమ్‌లోనే కష్టపడుతూ ఉండేవారు. ఇప్పుడు సమంత తన మాజీ భర్తతో సన్నిహితంగా ఉండటం లేదు. కానీ అక్కినేని వారితో మాత్రం అదే బంధాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఉంది.

అఖిల్ సినిమాలకు, పోస్టులకు కామెంట్ చేస్తుంది. సుశాంత్, సుమంత్, సుప్రియ, వెంకీ మామ కూతురు ఆశ్రితలు మాత్రం సమంతకు ఇంకా కాంటాక్ట్‌లోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. గత ఏడాది సమంత అయితే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా ట్రెండ్ అయింది.

Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే

Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News