Samantha Pet Dog: నాగచైతన్య దగ్గర సమంత పెట్ డాగ్ ఉందేంటి? వాళ్లిద్దరూ కలిసిపోయారా..?

సమంత నాగచైతన్య విడాకులు ఎంత పెద్ద దుమారం లేపిందో మన అందరికి తెలిసిందే. విడాకుల తరువాత ఇద్దరు వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ సమంత ఇంట్లో ఉండాల్సిన ఒక కుక్క నాగచైతన్యతో కనపడింది. ఇది చూసిన అభిమానులు మళ్ళీ ప్యాచ్ అప్ లో అయ్యారని వాపోతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2023, 05:03 PM IST
Samantha Pet Dog: నాగచైతన్య దగ్గర సమంత పెట్ డాగ్ ఉందేంటి? వాళ్లిద్దరూ కలిసిపోయారా..?

Samantha Pet Dog: స్టార్ కపుల్ నాగచైతన్య, సమంతల పెళ్లి.. ఆ తర్వాత వారిద్దరి విడాకుల విషయం అప్పట్లో పెద్ద టాపిక్ అయిపోయింది. అయితే వారు విడిపోయిన తర్వాత వారిద్దరికి సంబంధించిన విషయాలను నిత్యం ఏదో ఒకటి చర్చకు వస్తున్నాయి. అయితే విడిపోయిన తర్వాత నాగచైతన్య డేటింగ్ పై కొన్ని రూమర్లు వచ్చాయి. ప్రముఖ నటి శోభితా దూళ్లిపాళతో 'చై' ప్రేమాయణం సాగిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ వార్తలపై అతని మాజీ భార్య, హీరోయన్ సమంత కూడా పరోక్షంగా పలు మార్లు స్పందించారు. అయితే నాగచైతన్య మాత్రంలో తన మాజీ భార్యపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. ఒకింత సమంతపై తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేసేవాడు. 

అయితే వీరిద్దరికీ ఒక అలవాటు ఉండేది. నాగచైతన్య, సమంత జంతు ప్రేమికులు. వారిద్దరి పెళ్లి తర్వాత వాళ్ల ఇంట్లో రెండు కుక్క పిల్లల్ని పెంచుకున్నారు. ఆ టైంలో వాళ్ల ఇంట్లో హాష్, సాషా అనే పెట్ డాగ్స్ ఉండేవి. సమంత పెట్ హాష్ అంటే చైతన్యకి అమితమైన ప్రేమ. అయితే విడాకుల తర్వాత ఎవరి పెట్స్ ను వాళ్లు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడు హాష్, సాషాలు సమంతతో ఉంటున్నట్లు సమాచారం. 

తాజాగా హీరోయిన్ సమంత తన పెట్ డాగ్స్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే దాన్ని పోలిన పెట్ డాగ్ రీసెంట్ గా నాగచైతన్య వీడియోలలో కూడా కనిపిస్తుండడం గమనార్హం. అయితే దీన్ని గమనించిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. సమంత దగ్గర ఉండాల్సిన హాష్ పెట్.. నాగచైతన్య దగ్గర ఉందేంటి? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. 

Also Read: Jio vs Airtel Fiber plans: జియో , ఎయిర్‌టెల్ ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ వివరాలు ఇవే

ఏం జరిగిందంటే..?
తాజాగా హీరో నాగచైతన్య వద్దకు ఓ అభిమాని తన స్పోర్ట్స్ బైక్ ను తీసుకొచ్చాడు. నాగచైతన్య ఆటోగ్రాఫ్ కోసం రాగా.. బండిపై 'చై' సైన్ చేశాడు. ఆ తర్వాత బైక్ ఎక్కి ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. అయితే అదే టైంలో నాగచైతన్య దగ్గర పెట్ డాగ్ హాష్ ను పోలిన డాగ్ కనిపించింది. అయితే అది సమంత పెట్ డాగ్ అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఇది సమంత పెట్ డాగ్ కదా? నాగచైతన్య దగ్గర ఎందుకు ఉంది? వాళ్లిద్దరూ మళ్లీ కలిసిపోయారా? లేదా అలాంటి మరో పెట్ డాగ్ ను నాగచైతన్య పెంచుతున్నారా? అనే దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. 

నాగచైతన్య సినిమాలు..
హీరో నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. మత్స్యకారుల కథా నేపథ్యంతో సాగే ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. 'లవ్ స్టోరీ' లాంటి సూపర్ హిట్ తర్వాత ఈ జంట మళ్లీ కలిసి నటించడం ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి.

Also Read: Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణ వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News