Naga Chaitanya-Samantha: విడాకుల తర్వాత ఒకే చోట నాగ చైతన్య, సమంత..?

Naga Chaitanya-Samantha: నాగ చైతన్య-సమంత జంట విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ కలుసుకోలేదని వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. అయితే ఆ ఇద్దరూ తప్పనిసరిగా ఒకే చోటకు వెళ్లాల్సిన పరిస్థితి తాజాగా వచ్చినట్లు సమాచారం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2021, 07:56 PM IST
  • విడాకుల తర్వాత ఒకే చోట సమంత, నాగ చైతన్య!
  • వేదికైన రామానాయుడు స్టూడియోస్​!
  • వేర్వేరు సినిమా షూటింగ్స్​లో భాగంగా...
Naga Chaitanya-Samantha: విడాకుల తర్వాత ఒకే చోట నాగ చైతన్య, సమంత..?

Naga Chaitanya-Samantha: టాలీవుడ్​లో కొంత కాలంగా హాట్​ టాపిక్​గా మరిన విషయం నాగ చైతన్య, సమంత విడాకులు. ఈ విషయంపై చాలా కాలంగా వార్తలు రాగా.. మూడు నెలల క్రితం అధికారికంగా విడాకుల గురించి ప్రకటించారు (Naga Chaitanya-Samantha Divorce news) ఈ ఇద్దరు.

కారణం చెప్పకున్నా.. తాము వేర్వేరు మార్గాల్లో ప్రయాణించనున్నట్లు తెలిపారు. ఇకపై భార్య, భర్తలుగా కొనసాగలేమని.. విడిపోయి మంచి స్నేహితులుగా కలిసి ఉంటామని (Samantha Divorce news) చెప్పారు.

ఎవరి పనుల్లో వారు బిజీ బీజీ...

విడాగుల ప్రకటన తర్వాత ఇద్దరు వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు. విడాకులపై సోషల్​ మీడియాలో వచ్చిన కామెంట్స్​పై స్పందిస్తూ.. సమంతా అప్పుడప్పుడూ వార్తల్లో నిలిచారు.

వరుస సినిమాలు ఓకే చేస్తూ కూడా అమె ఎప్పుడు వార్తల్లో ఉంటున్నారు. ఇక నాగ చైతన్య మాత్రం అడపా దడపా సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండటం తప్పా.. మీడియా ముందు పెద్దగా రాలేదు. తాను హీరోగా నటించిన లవ్​స్టోరీ ప్రమోషన్స్​లో మాత్రం (Naga Chaitanya Divorce news) పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా.. విడాకుల తర్వాత సమంతా, నాగ చైతన్య కలిసి ఒక్కసారి కూడా కనిపించలేదు. కనీసం ఒకరినొకరు కలుసుకోలేదు కూడా.

తప్పక కలవాల్సిన పరిస్థితి?

తాజాగా తప్పని సరిగా నాగ చైతన్య, సమంత కలవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. రామానాయుడు స్టూడియోస్​ ఇందుకు వేదికైనట్లు సమాచారం. నాగ చైతన్య నటిస్తున్న బంగార్రాజు, సమంత నటిస్తున్న యశోద షూటింగ్​లు రామానాయుడు స్టూడియోలో శుక్రవారం జరిగినట్లు తెలిసింది. దీనితో సామ్​, చై ఒకే చోట ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఇద్దరు మాట్లాడుకున్నారా?

ఒకే చోట ఉన్నప్పటికీ ఈ ఇద్దరూ మాట్లాడుకోలేదని, కనీసం కలుసుకోలేదని తెలుస్తోంది. షూటింగ్​ గురించి ముందే తెలిసిన ఇద్దరూ ఒకరికి ఒకరు ఎదురుపడకుండా జాగ్రత్త పడ్డట్లు సమాచారం. సినీ వార్గాల్లో ఇప్పుడు ఈ విషయంపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం విడాకుల సమయంలో చెప్పినట్లుగా వీరిద్దరూ మంచి స్నేహితులుగా కలిసి ఉంటే బాగుండుందని అంటున్నారు.

Also read: Hero Nikhil: థియేటర్లు మూతపడటం చూస్తుంటే గుండె పగిలిపోతుంది: నిఖిల్‌

Also read: Ghani Film: వరుణ్​ తేజ్ 'గని' విడుదల తేదీ ఫిక్స్​- వాయిదా అందుకేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News