Samantha Update: సమంత హెల్త్ అప్డేట్ ఇచ్చేసింది.. ఇప్పుడు ఆరోగ్యపరిస్థితి ఎలా ఉందంటే?

Samantha Health Update: సమంత కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు ప్రకటించిన క్రమంలో తాజాగా ఆమె హెల్త్ అప్డేట్ ఇచ్చేసింది, ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 11, 2023, 10:22 PM IST
Samantha Update: సమంత హెల్త్ అప్డేట్ ఇచ్చేసింది.. ఇప్పుడు ఆరోగ్యపరిస్థితి ఎలా ఉందంటే?

Samantha Health Update: స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత ప్రతి చిన్న విషయంలోనూ వార్తల్లోకి ఎక్కుతూ వస్తున్నారు. ఆమె ఎలాంటి పోస్ట్ పెట్టినా కూడా అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెంటనే ఆమె గురించిన వార్తలు కూడా మీడియాలో కథనాలుగా ప్రసారమవుతున్నాయి. అయితే ఆ మధ్య తాను మాయోసైటిస్ ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఆమె ప్రకటించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అది ప్రాణాంతకమైన వ్యాధి అని తెలవడంతో అందరూ ఆమె కోలుకోవాలని ప్రార్థించారు. అయితే ఆ తరువాత ఆమె కొన్నాళ్లపాటు మీడియాకి, సోషల్ మీడియాకి కూడా దూరమైంది.

ఆ సమయంలో ఆమె అమెరికా వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. అంతేకాదు ఆమె గర్భసంచి తొలగించుకోబోతున్నారంటూ కూడా రకరకాల ప్రచారాలు అయితే దాని మీదకు వచ్చాయి. తరువాత ఆమె ఇప్పటివరకు ఆమె ఆరోగ్యం గురించి స్పందించలేదు కానీ సోషల్ మీడియాలో తన వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు మాత్రమే షేర్ చేస్తోంది. అయితే ఎట్టకేలకు తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చింది. ఆమె తన వ్యాధి నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, చికిత్సల గురించి ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. నేను మయోసైటిస్ కు చెందిన  మంత్లీ ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబలిన్ థెరపీ (ఐవీఐజీ) సెషన్కు హాజరయ్యానని ఆ థెరపీ వల్ల శరీరంలో బలహీన పడిన ఇమ్యూనిటీ సిస్టం చక్కగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.

ఇమ్యూనిటీ సిస్టం ఇతర వ్యాధులకు కూడా గురికాకుండా కాపాడుతోందని అలాగే ఇది చేసే సమయంలో రోజుకు రెండు నుంచి నాలుగు గంటల పాటు శ్రమించాలని వ్యాయామం కూడా తప్పనిసరిగా చేయాలని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను ఇంట్లోనే ఈ థెరపీ తీసుకుంటున్నానని, ఆమె పేర్కొంది. ఈ విషయం మీద అవగాహన పెంచే ప్రయత్నం చేశారు, అదే సమయంలో తాను జిమ్ చేస్తున్న వీడియోను సైతం సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దీనితో సమంత అభిమానులు మీరు కోలుకోవడం ఆనందంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాల విషయానికొస్తే ఆమె శాకుంతలం అనే సినిమా చేసింది, ఆ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన విడుదల అవ్వాల్సి ఉంది కానీ పలు కారణాలతో దాన్ని ఏప్రిల్ 14వ తేదీకి వాయిదా వేశారు. మరోపక్క ఆమె విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆ సినిమా షూటింగ్ అయితే ప్రస్తుతానికి వాయిదా పడింది.
Also read: Veera Simha Reddy OTT :వీర సింహారెడ్డి ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. ఎందులోనో తెలుసా?

Also Read: Nandamuri Ramakrishna Accident: నందమూరి రామకృష్ణ కారుకు యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News