Bollywood Relationships: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి కాకముందే బ్రేకప్ చెప్పుకున్న బాలీవుడ్ జంటలు

Bollywood Affairs and Relationships: సినీ పరిశ్రమలో పెళ్లయిన వాళ్లు విడిపోవడం చాలా సర్వసాధారణంగా చూస్తున్న విషయం. బాలీవుడ్ లోనైతే ఈ కల్చర్ ఇంకా చాలా కామన్. అయితే, ఇంకొన్ని జంటల పెళ్లిళ్లు మాత్రం పెళ్లిపీటల వరకు వచ్చి పీటలు ఎక్కక ముందే ఆగిపోయాయి.

Written by - Pavan | Last Updated : Oct 12, 2022, 04:44 AM IST
  • అప్పటి వరకు రిలేషన్‌షిప్‌లో ఉండి, ఎంగేజ్‌మెంట్ తర్వాత మనసు మార్చుకున్న జంటలు
  • ఇండస్ట్రీలో, మీడియాలో అంతా తెలిసాకా పెళ్లి రద్దు చేసుకున్న జంటలు
  • ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయిన సల్మాన్ ఖాన్
Bollywood Relationships: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి కాకముందే బ్రేకప్ చెప్పుకున్న బాలీవుడ్ జంటలు

Bollywood Affairs and Relationships: అంగరంగ వైభవంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెళ్లి చేసుకునే నాటికే తేడాలొచ్చి విడిపోయిన జంటలు బాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. అలా బాలీవుడ్‌లో పెళ్లి వరకు వచ్చి పెళ్లి కాకుండానే ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేసుకున్న సినీ స్టార్స్ జాబితాపై ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం.

1) Abhishek Bachchan, Karisma Kapoor: ఎంగేజ్‌మెంట్ తర్వాత బ్రేకప్ చెప్పుకున్న అభిషేక్ బచ్చన్, కరిష్మా కపూర్

Abhishek Bachchan Karisma Kapoor engagement broken

అందరికి తెలిసేలా ఘనంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెళ్లి కాకముందే విడిపోయిన ప్రముఖ బాలీవుడ్ జంటల్లో అభిషేక్ బచ్చన్, కరిష్మా కపూర్ జంట ఒకటి. వీళ్లిద్దరి ఎంగేజ్‌మెంట్ అప్పట్లో ఓ పెద్ద ఈవెంట్. అమితాబ్ బచ్చన్ భార్య, అభిషేక్ బచ్చన్ తల్లి అయిన జయా బచ్చన్ ఏకంగా కరిష్మా కపూర్‌ని కోడలిగా మీడియాకు పరిచయం చేసేసింది. కానీ ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ పెళ్లి జరగలేదు.

2) Akshay Kumar, Raveena Tandon: అప్పటి వరకు హిట్ పెయిర్.. ఆ తర్వాత ఇక కలవనే లేదు

 Akshay Kumar, Raveena Tandon relationship broken after engagement

అక్షయ్ కుమార్‌కి, బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్‌కి పెళ్లి అయిపోతున్నట్టు వార్తలొచ్చాయి. అప్పటికే వీళ్ల ఎంగేజ్‌మెంట్ కూడా అయింది. ఇంతలోనే షాకింగ్ న్యూస్.. అక్షయ్ కుమార్, రవీనా టాండన్ పెళ్లి చేసుకోవడం లేదు. బ్రేకప్ అయిందని. తమ ఇద్దరి మధ్య బ్రేకప్‌కి అక్షయ్ కుమారే కారణం అని రవీనా టాండన్ చెప్పుకొచ్చింది. కారణం ఏదైనా అప్పటి వరకు కలిసి షికార్లు కొట్టిన ఈ జంట ఆ తర్వాత కలిసి కనిపించిన దాఖల్లేవు.

3) Salman Khan, Sangeeta Bijlani: బాలీవుడ్ చూసిన ఫేమస్ ఎఫైర్స్‌లో ఒకటి సల్మాన్ ఖాన్, సంగీతా బిజ్లాని

Salman Khan Sangeeta Bijlani relationship broken after engagement

బాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన ఫేమస్ లవ్ ఎఫైర్స్‌లో సల్మాన్ ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ సంగీతా బిజ్లాని జంట ఒకటి. బాలీవుడ్ చూసిన మిస్టీరియస్ లవ్ బ్రేకప్స్‌లోనూ ఇదే ఫేమస్ జంట. ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లి కార్డులు వరకు వచ్చిన ఈ జంట పెళ్లి పీటలు ఎక్కలేకపోయింది. వీళ్లిద్దరూ ఎందుకు విడిపోవడానికి సరైన కారణం ఏంటనేది ఇప్పటివరకు అంతు చిక్కని విషయం. ఈ సంగీతా బిజ్లాని ఎవరో కాదు... ఫేమస్ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ మాజీ భార్యనే. అవును.. 1996లో అజురుద్దీన్ ని పెళ్లి చేసుకున్న అజారుద్దీన్ - సంగీతా బిజ్లాని జంట 2010 లో డైవర్స్ తీసుకున్నారు.

4) Sajid Khan, Gauhar Khan: సాజిద్ ఖాన్, గౌహర్ ఖాన్

Sajid Khan Gauhar Khan relationship broken after engagement

2003 లో ఫేమస్ ఫిలింమేకర్ సాజిద్ ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ గౌహర్ ఖాన్‌ల పెళ్లి ఎంగేజ్‌మెంట్ స్టేజ్ దాటుకుని పెళ్లి వరకు వచ్చింది. ఇద్దరూ ఒక్కింటి వారు కాబోతున్నారనుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య తేడాలొచ్చి, దూరం పెరిగింది. ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకుని పెళ్లి వరకు రాకుండానే వీళ్ల పెళ్లి ఆగిపోయింది. 

5) Karan Singh Grover, Barkha Bisht: కరణ్ సింగ్ గ్రోవర్, బర్కా బిష్ట్.. 

Karan Singh Grover Barkha Bisht relationship broken after engagement

కరణ్ సింగ్ గ్రోవర్ ఎవరో తెలుసు కదా.. బాలీవుడ్‌లో పది, ఇరవై ఏళ్ల క్రితం సెక్సీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న బిపాసా బసు భర్తే కరణ్ సింగ్ గ్రోవర్. కరణ్ సింగ్ గ్రోవర్‌కి ఇది మూడో పెళ్లి. మొదట 2008లో హీరోయిన్ శ్రద్ధా నిగమ్‌ని పెళ్లాడిన కరణ్ సింగ్.. ఏడాది వ్యవధిలోనే డైవర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత 2012 లో మరో హీరోయిన్ జెన్నిఫర్ వింగెట్‌ని పెళ్లి చేసుకున్న కరణ్ సింగ్ గ్రోవర్ ఆ తర్వాత రెండేళ్లకు ఆమెతోనూ డైవర్స్ తీసుకున్నాడు. ముచ్చటగా మూడోసారి బిపాసా బసును పెళ్లి చేసుకున్నాడు. 

అయితే.. వీళ్లందరి కంటే ముందుగా కరణ్ సింగ్ లైఫ్‌లోకి వచ్చినామె పేరే ఈ బర్కా బిష్ట్. హిందీ టెవీ నటి, సినిమా హీరోయిన్ అయిన బర్కా బిస్ట్, కరణ్ సింగ్ ఇద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. 2008లో ఇంద్రనీల్ సేన్ గుప్తా అనే టీవీ కమ్ బాలీవుడ్ యాక్టర్‌ని పెళ్లి చేసుకున్న బర్కా బిష్ట్.. ఇప్పటి వరకు అతడితోనే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. చూశారా.. బిపాసా బసు ( Bipasha Basu Pregnancyభర్త కరణ్ సింగ్ గ్రోవర్ వేషాలు చూశాకా.. అతడి ఫస్ట్ గాళ్ ఫ్రెండ్ ఒకరిని పెళ్లి చేసుకుని, జీవితాంతం అతడితోనే కలిసి ఉండటం కూడా ఒక గొప్ప విషయంగానే పరిగణించాల్సిన దుస్థితి దాపురించింది.

Also Read : Unstoppable with NBK Promo : చంద్రబాబు ముందు నారా లోకేష్ రొమాంటిక్ పర్సనల్ ఫోటోలు.. షోలో చెడుగుడు ఆడేసుకున్న బాలయ్య

Also Read : Sreemukhi : ఎద అందాల గుట్టురట్టు.. రెచ్చిపోతోన్న శ్రీముఖి.. పిక్స్ వైరల్

Also Read : GarikaPati - Chiranjeevi : అదృష్టం కొద్దీ చిరంజీవి అధికారంలోకి రాలేదు.. గరికపాటి నాటి వీడియో వైరల్

Also Read : Samantha : నువ్ ఎప్పటికీ ఒంటరిగా నడవలేవు!..అది చూపిస్తూ సమంత పోస్ట్.. ఉద్దేశ్యం ఏంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News