Salaar 2 Update: 'సలార్ 2.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా ఉంటుంది'.. రిలీజ్ డేట్ ఇదే..: నిర్మాత

Producer Vijay hints Salaar 2 Shooting: బాక్సాఫీస్ పై ప్రభాస్ దండయాత్ర కొనసాగుతోంది. అయితే సలార్ 2 ఎప్పుడు ఉండబోతుందా అని అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఈ నేపథ్యంలో పార్ట్ 2 ఎప్పుడు, ఎలా ఉండబోతుందనే విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చేశారు నిర్మాత.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2024, 12:24 PM IST
Salaar 2 Update: 'సలార్ 2.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా ఉంటుంది'.. రిలీజ్ డేట్ ఇదే..: నిర్మాత

Salaar Part 2 Release date: సలార్ తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్ల మార్కును క్రాస్ చేసింది. దేశవ్యాప్తంగా రూ. 373.57 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సాధించింది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తర్వాత  రూ.650 కోట్ల మార్కును దాటిన మూడో తెలుగు సినిమా సలార్ చరిత్ర సృష్టించింది. వరల్ వైడ్ గా బాహుబలి 2 రూ. 1788 కోట్లు, RRR రూ. 1230 కోట్ల వసూళ్లు రాబట్టాయి. రెండు వారాల దాటిన సలార్ కలెక్షన్స్ జోరు తగ్గడం లేదు. ఇప్పటికీ తెలుగు మార్కెట్‌లో 17.97% ఆక్యుపెన్సీని, ఢిల్లీ-NCR ప్రాంతంలో16.5% ఆక్యుపెన్సీతో దూసుుపోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రీయా రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. 

''గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’''లా ఉండబోతుంది: నిర్మాత
సలార్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో సలార్ 2పై విపరీతమైన బజ్ నెలకొని ఉంది. తాజాగా సలార్ రెండో పార్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ (Vijay Kiragandur). ''సలార్ 2 స్క్రిప్టు రెడీ అయిందని... ఎప్పుడైనా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని.. అంతేకాకుండా ప్రశాంత్, ప్రభాస్ వీలైనంత త్వరగా షూటింగ్ మెుదలుపెట్టాలనుకుంటున్నారని.. మెుత్తంగా పార్ట్ 2ని 15 నెలల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తన్నామని''విజయ్  చెప్పారు. అంతేకాకుండా సలార్ 1.. పార్ట్ 2కు ట్రైలర్ మాత్రమేనని.. రెండో భాగం ‘''గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’''లా ఊహించని ట్విస్టులతో ఉంటుందని విజయ్ చెప్పారు. సీక్వెల్‌లో యాక్షన్‌, డ్రామా, పాలిటిక్స్‌.. వంటి చాలా ఆంశాలను కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. 

Also Read: Tamannaah Bhatia: న్యూలుక్ లో న్యూఇయర్ మొదలుపెట్టిన తమన్నా.. లండన్ వీధుల్లో అందాలవిందు

Also Read: Pushpa2: సుకుమార్‌కు పాఠాలు నేర్పిస్తున్న యాంకర్.. పుష్ప-2 కోసం బిగ్ ప్లాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News