Saif ali khan stubbing case: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఘటనలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జన్వరి 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో చోరికి వచ్చిన దుండగుడు సైఫ్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఇద్దరి మధ్య తొపులాట జరిగింది. ఈ అలజడితో సైఫ్ కుమారుడు మేల్కొన్నాడు. ఆటోలో లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు నటుడికి రెండు సర్జరీలు చేశారు. వెన్నుపాములో ఉన్నకత్తిని తొలగించారు. ఇదిలా ఉండగా సైఫ్ ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు.
తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ ను కలిసి ఎమోషనల్ అయ్యారు. ఆటోవాలకు సైఫ్.. 50 వేల రూపాయలు, సింగర్ 1 లక్షరూపాయలు, మరో సంస్థ 11 వేల రూపాయల్ని రివార్డుగా ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నిందితుడు షరీపూర్ ఇస్లాం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. జన్వరి 29న కోర్టులో మరోసారి ప్రవేశ పెట్టనున్నారు.
ఇదిలా ఉండగా.. నిందితుడి తండ్రి మహమ్మద్ రూహుల్ అమిన్ ఫకీర్ ఈ ఘటనపై మాట్లాడాడు. తనకొడుకు అమాయకుడని.. అతడ్ని అక్రమంగా కేసులో ఇరికించారన్నారు. తన కొడుకు 2024 లో బంగ్లాదేశ్ లో గొడవలు జరిగినప్పుడు భారత్ కు వచ్చాడని తొలుత వెస్ట్ బెంగాల్ హోటల్ లో ఉద్యోగం చేశాడని, మరల ముంబైలో జీతాలు ఎక్కువిస్తారంటే అక్కడికి వెళ్లాడని చెప్పాడు.
ప్రతి నెల జీతం తీసుకొగానే.. తమకు ఫోన్ చేస్తాడని అన్నాడు. సీసీ కెమెరాలో ఆగంతకుడి వెంట్రుకలు పెద్దగా ఉన్నాయని.. తన కొడుకు వెంట్రుకలు మరోలా ఉన్నావని అన్నాడు. దీనిపై తాను బంగ్లాదేశ్ కోర్టును ఆశ్రయిస్తానని మహమ్మద్ రూహుల్ అమిన్ ఫకీర్ చెప్పుకొచ్చాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter