Thandel: తండేల్ షూటింగ్ స్పాట్ ఫోటోలు.. సాయి పల్లవిని ఇంత అందంగా ఎప్పుడు చూసిఉండరు!

Sai Pallavi Photos: నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాబోతున్న సినిమా తండేల్. ఈ చిత్రం శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి వైరల్ అయిన ఫోటోలు అభిమానులను తెగ మెప్పిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2024, 03:52 PM IST
Thandel: తండేల్ షూటింగ్ స్పాట్ ఫోటోలు.. సాయి పల్లవిని ఇంత అందంగా ఎప్పుడు చూసిఉండరు!

Sai Pallavi: వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగచైతన్య ఎలాగైనా హిట్ కొట్టాలని.. తన ఆశలన్నీ పెట్టుకున్న చిత్రం తండేల్. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరూ కలిసి ఇదివరకు నటించిన లవ్ స్టోరీ సినిమా కూడా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా విజయం సాధిస్తే వీరిద్దరి జంట హిట్ పైర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకోవడం ఖాయం. 

కాగా చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఒక వైవిద్యమైన కథతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. ఇండియా నుంచి సముద్రంలో వేటకి వెళ్లి తప్పిపోయి.. పాకిస్థాన్ అధికారులకు చిక్కిన జాలర్ల కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది అని వినికిడి. ఈ సినిమాలో నాగ చైతన్య ఓ ఫిషర్ మెన్ గా నటిస్తున్నాడు. నాగచైతన్య పాకిస్తాన్ వారికి దొరికిన తరువాత.. అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు అనే దానిపైన ఈ చిత్రకథ ఉంటుందట. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన చిన్న గ్లింప్స్ ఈ సినిమాపై సినీ ప్రేక్షకులకు అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు సాయి పల్లవి అవమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

తండేల్ యూనిట్ విడుదల చేసిన ఈ ఫోటోలలో నాగచైతన్య, సాయి పల్లవి, డైరెక్టర్ చందూ మొండేటి, నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు.. ఉన్నారు. ఒక్క ఫొటోలో తీయబోయే సీన్స్ గురించి చందూ మొండేటి నాగ చైతన్యకు, అల్లు అరవింద్ కి చెబుతూ ఉండటం మనం గమనించవచ్చు.

అయితే ఈ ఫోటోలు అన్నీ ఒక ఎత్తు అయితే సాయి పల్లవి ఉన్న ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో సాయి పల్లవి ఎంతో పద్ధతిగా అలానే ఎంతో అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సాయిపల్లవి ఒక చిన్న పాపని తన ఒళ్ళో కూర్చొని మురిసిపోతున్న ఫోటో అందరిని అలరిస్తోంది. ఇక ఈ ఫోటోని గమనిస్తే రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో ప్రస్తుతం షూట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఫోటోతో పాటు మరికొన్ని సాయి పల్లవి ఫోటోలు కూడా షేర్ చేశారు సినిమా యూనిట్.

 

సాయి పల్లవికి తెలుగు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో తెలిసిందే. అయితే ఈ మధ్య సినిమాలలో పెద్దగా కనిపించకపోవడం వల్ల ఇటీవల చాలా రేర్ గా సాయి పల్లవి ఫొటోలు బయటకి వస్తున్నాయి. ఈ క్రమంలో సాయి పల్లవి ఇంత అందమైన ఫోటోలు బయటకి రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

GA2 పిక్చర్స్ నిర్మాణంలో బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం కోసం స్పెషల్ గా హైదరాబాద్ లో భారీ పాకిస్తాన్ సెట్ వేసి షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ సంవత్సరం చివరిలో విడుదల కావచ్చు అని వినికిడి.

Also Read: మేషరాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారి భవిష్యత్తు పూర్తిగా మారబోతోంది..

Also Read: కెమికల్స్ రహిత హోలి రంగులు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News