‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి మరో అప్డేట్.. ‘జనని’ పాట రిలీజ్ ఎప్పుడంటే?

RRR Movie Updates Today: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చేసింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలోని ‘జనని’ అనే పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నవంబరు 26న ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2021, 08:21 PM IST
‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి మరో అప్డేట్.. ‘జనని’ పాట రిలీజ్ ఎప్పుడంటే?

RRR Movie Updates Today: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధానపాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచింది చిత్రబృందం. 'ఆర్ఆర్‌ఆర్‌' సోల్‌ ఆంథమ్‌ 'జనని' అంటూ సాగే పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కీరవాణి స్వరపరిచిన పాట భావోద్వేగంతో సాగుతుందంటూ ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని 'దోస్తీ', 'నాటు నాటు' పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామాగా రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో అల్లూరి సీతరామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్​గా తారక్‌ నటించారు. ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: కరోనాతో ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్.. జాగ్రత్తగా ఉండండి అంటూ అభిమానులకు ట్వీట్

Also Read: కైకాల సత్య నారాయణ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్​ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News