RRR Movie: దేశభక్తి సినిమా కాదట..మూవీ టీమ్ ఏం చెప్పిందంటే..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ), యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Jr NTR ) కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR.

Last Updated : Oct 11, 2020, 07:43 PM IST
    • మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్, కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR.
    • ఈ మూవీని సుమారు రూ.400 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
RRR Movie: దేశభక్తి సినిమా కాదట..మూవీ టీమ్ ఏం చెప్పిందంటే..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ), యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Jr NTR ) కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఈ మూవీని సుమారు రూ.400 కోట్లతో డీవీవీ దానయ్య తెరకెక్కిస్తున్నారు. RRR రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురమ్ భీమ్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలిసిందే. సుమారు ఆరు నెలల పాటు కరోనావైరస్ వల్ల షూటింగ్ నిలిచిపోగా.. ఇటీవలే మళ్లీ ప్రారంభం అయింది.

Also Read: HBD Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు

RRRకు సంబంధించిన టీమ్ కొత్త ఫోటోను శనివారం పోస్ట్ చేసింది. ఇందులో రెండు చేతులు కలుస్తున్నట్టుగా ఉంది. వీటిపై సోషల్ మీడియాలో నెటిజెన్స్ ( Netizens ) రకరకాల లెక్కలు వేయడం ప్రారంభించారు. అందులో ఒక నెటిజెన్ స్పందిస్తూ.. అల్లూరి సీతారామ రాజు, కొమురమ్ భీమ్ కలిసి స్వాతంటం చేయడానికి చేయి కలిపారు కదా అని పోస్ట్ చేశారు. దీనికి సినిమా టీమ్ స్పందిస్తూ ఆసక్తికరమైన రిప్లై ఇచ్చింది.

వాళ్లిద్దరూ కలుస్తారు. అవును ఈ చిత్రంలో ఉన్నది వారి చేతులే. కానీ మీరు అన్నట్టు వారిద్దరు కలిసి స్వాతంత్ర్య పోరాటం ఈ చేసే సినిమా కాదు ఇది. ఇది పూర్తిగా కల్పితమైన కథ. దేశభక్తి చిత్రం కాదు అని రీప్లై ఇచ్చారు. కాగా ఈనెల 22న RRR మూవీ టీజర్ విడుదల కానుంది అని సమాచారం

ALSO READ | RGV : ఒబామా, ట్రంప్ మధ్య తేడాలేంటో చెప్పే ఆర్జీవి వీడియో

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News