RRR Pre Release Event: ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు భారీ ప్లాన్- వేడుక ఎప్పుడంటే?

RRR Pre Release Event: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ (RRR Pre Release Event) ను గ్రాండ్ గా డిసెంబరు 19న ముంబయి వేదికగా నిర్వహించనున్నట్లు సమాచారం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2021, 07:22 PM IST
    • ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ భారీ ప్లాన్
    • ముంబయి వేదికగా డిసెంబరు 19న జరగనున్న వేడుక!
    • కార్యక్రమానికి అతిథులుగా టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు!
RRR Pre Release Event: ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు భారీ ప్లాన్- వేడుక ఎప్పుడంటే?

RRR Pre Release Event: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' (RRR Movie Update). రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. స్వాతంత్ర సమయంలో కల్పిత కథతో రూపొందించిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరు పెంచేసింది. 'ఆర్ఆర్ఆర్' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ (RRR Pre Release Event) ను గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. డిసెంబరు 19న ముంబయి వేదికగా ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఈ ఈవెంట్ కు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు సంబంధించిన కొందరు ప్రముఖులు అతిథులుగా విచ్చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.  

ఇటీవల సోషల్ మీడియాలో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' మూవీ ట్రైలర్ కు సామాజిక మాధ్యమాల్లో విశేషాదరణ లభిస్తోంది. అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న తొలి ఇండియన్ సినిమాగా 'ఆర్ఆర్ఆర్' రికార్డు నెలకొల్పింది. ట్రైలర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు సంబంధించిన ఇంటెన్స్ లుక్స్ తో పాటు డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమాకు దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ (RRR Movie Budget) కేటాయించినట్లు తెలుస్తోంది. 
ఈ సినిమా (RRR Movie Trailer Review) లో చరణ్, ఎన్టీఆర్ ల సరసన అలియా భట్, ఒలివియా మోరిస్ నటించారు. వీరితో పాటు అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. సంక్రాంతి కానుకగా (RRR Pre Release Event) జనవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా (RRR Movie Release Date) రిలీజ్ కానుంది.

Also Read: Pragya Jaiswal latest Photos : పసుపు రంగు డ్రెస్‌లో తళుక్కుమన్న ప్రగ్యా జైస్వాల్‌.. ప్రగ్యా లేటెస్ట్ ఫొటోలు

Also Read: స్కూల్ డ్రస్స్ లో ముద్దుగా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News