RRR movie Update: విడుదలకు ముందే ఆర్​ఆర్​ఆర్​ రికార్డులు- నాటు నాటు పాటకు 100 మిలియన్​ వ్యూస్​..

RRR movie Update: ఆర్​ఆర్​ఆర్​ మూవీ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రిలీజ్​ అయిన ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ 10 కోట్ల వ్యూస్​ను దాటేసింది. ఆర్​ఆర్​ఆర్​ మూవీ 25వ తేదీన విడుదలవనుంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2022, 07:05 PM IST
  • ఆర్​ఆర్​ఆర్​ మూవీ విడుదలకు ముందే రికార్డులు
  • యూట్యూబ్​లో నాటు నాటు సాంగ్​కు భారీ వ్యూస్​
  • ఈ నెల 25న విడుదలవనున్న సినిమా..
RRR movie Update: విడుదలకు ముందే ఆర్​ఆర్​ఆర్​ రికార్డులు- నాటు నాటు పాటకు 100 మిలియన్​ వ్యూస్​..

RRR movie Update: ప్రస్తుతం తెలుగుతో పాటు.. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లో ఆసక్తిగా ఎంతో ఎదురు చూస్తున్న మూవీ 'ఆర్​ఆర్​ఆర్​'. ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే మూవీ రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. నిజానికి ఈ ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా విడుదలవ్వాల్సి ఉంది. కరోనా థార్డ్ వేవ్​ కారణంగా వాయిదా పడి.. ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.

ఇదిలా ఉండగా.. ఇదివరకే విడుదలైన సినిమా సాంగ్స్​ ప్రస్తుతం ట్రెండవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 'నాట్ నాటు'  సాంగ్​ గురించి. తారక్​, చెర్రీలు తమ స్టెప్పులతో అదరొట్టిన ఈ సాగ్ మరో మైలురాయిని దాటింది. తాజాగా ఈ పాట యూట్యూబ్​లో 100 మిలియన్​ (10 కోట్లు) వ్యూస్​ దాటేసింది. ఈ పాట 2021 నవంబర్​లో యూట్యూబ్​లో విడుదలవగా.. ఇప్పటి వరకు మొత్తం 100,660,286 వ్యూస్​ వచ్చాయి. 13 లక్షల మందికి పైగా లైక్ కొట్టారు.

ఎన్టీఆర్​, రామ్​ చరణ్​లు హీరోలుగా నటించిన ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు అటు సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు దర్శక ధీరుడు రాజమౌలి బాహుబలి తర్వాత తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇటీవలే దుబాయ్​లో కూడా ప్రమోషన్స్ జరుపుకుంది. నేడు (శనివారం) బెంగళూలో ఆర్ఆర్​ఆర్​ ప్రమోషన్స్​ జరగుతున్నాయి.

ఆర్​ఆర్​ఆర్​ గురించి..

ఈ సినిమాలో రామ్​ చరణ్​ అల్లూరి సీతారామరాజుగా నటించారు. ఎన్టీఆర్​ కొమురం భీమ్​గా కనిపించనున్నారు. రామ్​ చరణ్​కు జోడీగా బాలీవుడ్​ బ్యూటీ ఆలియా భట్​ నటించింది. ఒలివియా మోరిస్ మరో హీరోయిన్​.

శ్రీయా వంటి, సముద్రకని సహా పలువురు ఈ సినిమాలో నటించారు. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్​గన్​ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతమందించారు. స్టోరీ కె.వి.విజయేంద్ర ప్రసాద్​. డీవీవీ ఎంటర్​టైన్మెంట్స్​ పతాకంపై.. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు.

Also read: RRR Movie Tickets: గ్యాస్ సిలిండర్ తీసుకుంటే.. ఉచితంగా ఆర్ఆర్ఆర్ మూవీ టిక్కెట్లు! ఎక్కడో తెలుసా?!!

Also read: Alia Bhatt Photos: గెటప్ మార్చేసిన 'గంగూబాయ్'.. చీరకట్టు నుంచి వెస్ట్రన్ డ్రస్సు వరకు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News