RRR Movie: థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్, నెట్‌ఫ్లిక్స్‌లో 45 మిలియన్ గంటల వీక్షణ రికార్డు

RRR Movie: ప్రపంచమంతా ప్రాచుర్యం పొందిన ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలోనే కాదు..ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. అత్యంత ప్రజాదరణ సాధించిన సినిమాగా నిలిచిందని నెట్‌ఫ్లిక్స్ స్వయంగా ప్రకటించింది. ఆ వివరాలు చూద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 23, 2022, 08:49 PM IST
RRR Movie: థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్, నెట్‌ఫ్లిక్స్‌లో 45 మిలియన్ గంటల వీక్షణ రికార్డు

RRR Movie: ప్రపంచమంతా ప్రాచుర్యం పొందిన ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలోనే కాదు..ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. అత్యంత ప్రజాదరణ సాధించిన సినిమాగా నిలిచిందని నెట్‌ఫ్లిక్స్ స్వయంగా ప్రకటించింది. ఆ వివరాలు చూద్దాం..

బాహుబలి నుంచి పాన్ ఇండియా సినిమాల దూకుడు ఎక్కువైంది. మరీ ముఖ్యంగా దక్షిణాది పాన్ ఇండియా సినిమాలు ఉత్తరాదిని ఊపేస్తున్నాయి. ఒక్క ఉత్తరాదినే కాకుండా ప్రపంచమంతా టాప్ కలెక్షన్లు చేస్తున్నాయి. బాహుబలి నిర్మాత రాజమౌళి తెరకెక్కించిన మరో పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ బాక్సాఫీసు వద్ద ఒక రేంజ్‌లో కలెక్షన్లు చేసింది. కలెక్షన్లలో కొత్త రికార్డులు నెలకొల్పింది. 

ఆ తరువాత సినిమా హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లోనూ, తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ భాషల్లో జీ5 ఓటీటీ వేదికల్లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డు స్థాయి కలెక్షన్లు చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు ఓటీటీల్లో కూడా దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ సాధించిన సినిమాగా ఖ్యాతినార్జించింది. మే 20 నుంచి ఇప్పటి వరకూ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా 45 మిలియన్ అవర్స్ స్ట్రీమ్ అయిందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఇది నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ సినిమా అని తెలిపింది. 

రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా..బ్రిటీషు కాలం నాటి పాత్రలకు కల్పిత గాధ. పాత్రలు నాటివైనా కధనం, కధ పూర్తిగా కల్పితం. సినిమాలో ఇద్దరి నటన, సంగీతం, గ్రాఫిక్స్, దర్శకత్వం, కొరియోగ్రఫీ కారణంగా సినిమా అందర్నీ ఆకట్టుకుంటోంది. భారీగా కలెక్షన్లు సృష్టిస్తోంది. 

Also read: Sammathame Tickets: మరికొన్ని గంటల్లో 'స‌మ్మ‌త‌మే' సినిమా రిలీజ్.. కామెంట్ చేసి ఫ్రీగా టికెట్ పొందండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Linkhttps://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News