Jr NTR: చరిత్ర సృష్టించిన జూ.ఎన్టీఆర్.. ఆస్కార్ అకాడమీ కొత్త మెంబర్ గా తారక్..

Jr NTR:  యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ఘనతను సాధించాడు. ఆస్కార్ అకాడమీ కొత్త మెంబర్ గా జూ.ఎన్టీఆర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని అకాడమీ అధికారికంగా ప్రకటించారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2023, 12:23 PM IST
Jr NTR: చరిత్ర సృష్టించిన జూ.ఎన్టీఆర్.. ఆస్కార్ అకాడమీ కొత్త మెంబర్ గా తారక్..

Jr NTR- Oscars Academy: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాతో గ్లోబల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎన్టీఆర్. ఈ సినిమాలో తారక్ నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా కొమురం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ జీవించిన విధానం న భూతో న భవిష్యత్తు అనే చెప్పాలి. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ గెలుచుకుని విశ్వవేదికపై తెలుగోడి సత్తాను చాటింది. 

అయితే తాజాగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేసే మూమెంట్‌ వచ్చేసింది. జూ.ఎన్టీఆర్ కు  ఆస్కార్‌ కమిటీ ఓ అరుదైన గౌరవాన్ని  అందించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ కమిటీలోని నటుల కేటగిరీలో ఎన్టీఆర్‌ను కొత్త అకాడమీ మెంబర్‌గా చేర్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట సమయంలోని విజువల్స్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది అకాడమీ. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టిం విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదో ప్రౌడ్‌ మూమెంట్‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. 

ఆస్కార్‌ కమిటీ సభ్యుడిగా నియమితులైన తొలి తెలుగు హీరోగా ఎన్టీఆర్‌ ఖ్యాతి గడించాడు. ఈ ఏడాదికి గాను ఆస్కార్ యాక్టర్స్ కేటగిరీలో  ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు చోటు లభించింది. ఇందుతో తారక్ తోపాటు  కే హుయ్ క్వాన్, కెర్రీ కాండన్, రోసా సలాజర్, మార్షా స్టెఫానీ బ్లేక్ ఉన్నారు. తారక్ ఈ ఘనత సాధించడంతో అభిమానులతోపాటు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

Also Read: Leo Movie Leaked: ‘లియో’ టీమ్‌కు భారీ షాక్.. అప్పుడే ఫుల్‌మూవీ ఆన్‌లైన్‌లో లీక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News