RRR Movie: కెనడాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా​.. కార్లతో RRR స్పెషల్ వీడియో..

RRR Movie: 'ఆర్​ఆర్​ఆర్' చిత్రయూనిట్ కు వినూత్న రూపంలో విషెస్​ తెలిపారు కెనడాలోని ఎన్టీఆర్​ ఫ్యాన్స్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2022, 08:07 PM IST
RRR Movie: కెనడాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా​.. కార్లతో RRR స్పెషల్ వీడియో..

Canada Jr Ntr Fans Celebration Video For RRR: రిలీజ్ కు ముందే 'ఆర్ఆర్ఆర్' (RRR) సందడి మెుదలైంది. వరల్డ్ వైడ్ గా ఎక్కడ చూసిన ఈ సినిమా హంగామానే కనిపిస్తోంది. జక్కన్న రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరెకెక్కించిన ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ...అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతుంది. కొంతమంది అభిమానులైతే డిఫరెంట్ స్టైల్​లో విషెస్​ చెబుతున్నారు. తాజాగా కెనడాలోని ఎన్టీఆర్​ ఫ్యాన్స్ (NTR Fans)​, ప్రవాసభారతీయులు కలిసి ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది.

ఈ వీడియోలో వీరంతా కార్లతో ర్యాలీగా బయలుదేరి వెళ్లి.. RRR ఆకృతిలో వాటిని అమర్చారు. దానికి బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​కు యాడ్ చేసి...'తొక్కుకుంటూపోవాలే' అని క్యాప్షన్​ జోడించారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆర్ఆర్ఆర్ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ వీడియోకు ఫిదా అయిన 'ఆర్​ఆర్​ఆర్'​ మేకర్స్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ వీడియోను సోషల్ ​మీడియాలో ట్వీట్​ చేసింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్, ఫ్యాన్స్ తమదైన శైలిలో లైక్స్​, కామెంట్స్​ చేస్తున్నారు. 

అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ (Ram Charan), కొమురం భీమ్ గా ఎన్టీఆర్ (jr, NTR) నటించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమాకు దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ (RRR Movie Budget) ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ ల సరసన అలియా భట్, ఒలివియా మోరిస్ నటించారు. వీరితో పాటు అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. కీరవాణి సంగీతమందించారు. ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News