Bengal Tiger Named As Prabhas: జూలోని ఆ టైగర్‌కు ప్రభాస్ పేరు..!

Bengal Tiger Named As Prabhas: బాహుబలి సినిమాతో ప్రభాస్‌ తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో తన దైన ముద్రవేశారు.బాహుబలి-2తో ప్రభాస్‌  ఎవరూ బద్దలుకొట్టని రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా  అతి పెద్ద పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2022, 02:15 PM IST
  • బెంగాల్ టైగర్‌కు ప్రభాస్ పేరు
  • సోషల్‌ మీడియా వేదికగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ హర్షం
  • నెట్టింట వైరల్ అవుతున్న బెంగల్ టైగర్‌
Bengal Tiger Named As Prabhas: జూలోని ఆ టైగర్‌కు ప్రభాస్ పేరు..!

Bengal Tiger Named As Prabhas: బాహుబలి సినిమాతో ప్రభాస్‌ తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో తన దైన ముద్రవేశారు.బాహుబలి-2తో ప్రభాస్‌  ఎవరూ బద్దలుకొట్టని రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా  అతి పెద్ద పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. అయితే అతను ఈ మధ్యే రెండు ఫ్లాప్స్‌ను కూడా చవిచూశారు. అయినప్పటికీ అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గిపోలేదు.ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి పాన్‌ ఇండియా సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.

నాటి నుంచి నేటి దాకా చాలా చిత్రాల్లో నటించి ప్రేక్షకాలోకంలో తనదైన ముద్రను వేశారు ప్రభాస్‌. అలాంటి ప్రభాస్ పేరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తెలియని వారే లేరంటే అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ ఆసక్తికరమైన రీతిలో నెట్టింట వైరల్‌ అవుతున్నారు. సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్ని పులి, సింహం లాంటి జంతువులతో పోల్చుతారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రభాస్ పేరును రాయల్ బెంగాల్ టైగర్‌కు పెట్టడం ఇప్పుడు సీని వర్గంలో చర్చాంశనీయమైంది.

ప్రస్తుతం జ్యూలోని ఓ టైగర్ కు ప్రభాస్‌ అని పేరు పెట్టడం ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ నెహ్రూ జ్యూపార్క్‌లోని ఓ బెంగాల్ టైగర్ కు బ్రాకెట్ లో ప్రభాస్ అని మెన్షన్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇలాంటి క్రేజ్ ఏ హీరోకి లభించకపోవడం విశేషమని చెప్పవచ్చు. ఈ విషయంపై సోషల్‌ మీడియాలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Video: ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అంపైర్‌తో పీవీ సింధు వాగ్వాదం... అసహనానికి లోనైన షట్లర్...   

Also Read: Acharya: 'చిరు', 'చిరుతకు' కూడా దక్కని అభిమానం.. రియల్ హీరోకి పూజలు, మామూలుగా లేదుగా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News