Rhea Chakraborty gets bail: రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు.. కానీ..

Rhea Chakraborty gets bail in Bollywood drugs case: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసిన బాంబే హై కోర్టు.. ఆమెకు పలు షరతులు విధించింది. రియా చక్రవర్తి సోదరుడు సోవిక్‌ చక్రవర్తి బెయిల్ పిటిషన్‌ని ( Showik Chakraborty bail plea) తిరస్కరించిన కోర్టు.

Last Updated : Oct 7, 2020, 01:37 PM IST
Rhea Chakraborty gets bail: రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు.. కానీ..

Rhea Chakraborty gets bail in Bollywood drugs case: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసిన బాంబే హై కోర్టు.. ఆమెకు పలు షరతులు విధించింది. రియాను ( Rhea Chakraborty ) దేశం వదిలి వెళ్లరాదని స్పష్టంచేస్తూ ఆమె పాస్‌పోర్ట్‌ని సమర్పించాల్సిందిగా తేల్చిచెప్పింది. కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని.. ఒకవేళ గ్రేటర్ ముంబై దాటి వెళ్లాల్సి వస్తే.. కేసు విచారణ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు షరతులు విధించింది. ప్రతీ పది రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్‌‌లో హాజరు కావాల్సి ఉంటుందని కోర్టు స్పష్టంచేసింది. Also read : Vakeel Saab షూటింగ్‌లో.. నివేదా థామస్

రియా చక్రవర్తి సోదరుడు సోవిక్‌ చక్రవర్తి బెయిల్ పిటిషన్‌ని ( Showik Chakraborty bail plea) తిరస్కరించిన కోర్టు.. అతడికి అక్టోబర్‌ 20 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

అంతకంటే ముందు ముంబై డ్రగ్స్ కేసు ( Mumbai drugs case ) నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌కి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తి డ్రగ్స్ అందించారనే ఆరోపణల నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( NCB ) విభాగం సెప్టెంబర్‌ 8న రియా చక్రవర్తిని అరెస్ట్ చేయగా అప్పటి నుంచి ఆమె జైల్లోనే ఉంది. రియా బెయిల్ పిటిషన్‌పై సెప్టెంబర్‌ 29న విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు అనంతరం తీర్పును రిజర్వులో ఉంచింది. రియాకు బెయిల్‌ ఇవ్వొద్దని ఎన్సీబీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. రియా చక్రవర్తి బయటికొస్తే.. సాక్ష్యాధారాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని ఎన్సీబీ అభ్యంతరాలు వ్యక్తంచేసింది. Also read : Guess Who: ఈ ఫొటోలోని సినీ సెలబ్రిటీని గుర్తుపట్టారా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News