దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ హాలీవుడ్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా అనుభవాలతో కూడిన "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" అనే చిత్రాన్ని ఇటీవలే తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే రోజున ఈ చిత్రాన్ని ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేస్తానని వర్మ ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఇంతలోనే ఆయన పేల్చాల్సిన బాంబు పేల్చాడు. ఈ చిత్రాన్ని ఉచితంగా చూపించడట. ఆన్లైన్లో డబ్బులు కట్టిమాత్రమే ఈ చిత్రాన్ని చూడచ్చని ఆయన తెలిపారు. మన దేశంతో పాటు ఇతర దేశస్థులు కూడా ఈ చిత్రాన్ని చూడాలంటే అక్కడి మార్కెట్ ప్రకారం ఆన్లైన్ ద్వారా డబ్బు చెల్లించి ఈ చిత్రం చూడాల్సిందే. ఇండియన్ కరెన్సీలో రూ.150 చెల్లించి ఈ చిత్రాన్ని చూడవచ్చని ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రొడక్షన్ సంస్థ తెలిపింది. అదే శ్రీలంక, పాకిస్తాన్లో అయితే రూ.200 ఛార్జి చేస్తున్నారు. అమెరికాలో మాత్రం 2.99 డాలర్లు, యూరప్‌లో అయితే 1.99 యూరోలను ఈ చిత్రాన్ని చూడడానికి వసూలు చేసే రుసుముగా ప్రొడక్షన్ సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో డిజిటల్ మీడియా ద్వారా ఆర్జీవీ విడుదల చేసే వెబ్ సిరీస్‌కు, షార్ట్ ఫిలిమ్స్‌కు కూడా ఆయన ఇలాగే ఛార్జ్ చేయనున్నట్లు తెలుస్తోంది.