RGV Meets CM YS Jagan : అసలు ఇప్పుడు డైరెక్టర్‌గా వర్మకు ఏమైనా క్రేజ్ ఉందా? వర్మ సినిమాలను అసలు ఎక్కడైనా చూస్తున్నారా? సినిమాల ప్రమోషన్స్‌లో వర్మ చేసే వ్యాఖ్యలు, చేష్టలు మాత్రమే హైలెట్ అవుతుంటాయి. కానీ వర్మ ఇప్పుడు తీస్తున్న సినిమాలను అసలు ఎవరైనా చూస్తున్నారా? అనేది అనుమానంగానే ఉంటుంది. అలాంటి వర్మను ఏపీ సీఎం జగన్ తన వద్దకు పిలిపించుకున్నాడని, వచ్చే ఎన్నికల గురించి చర్చించాడని, ఆ సమయంలోపు కొన్ని సినిమాలు తీసి పెట్టాలని అడిగాడట.
ఇలా సీఎం జగన్, వర్మ భేటీ గురించి నానా రకాల కథనాలు పుట్టుకొస్తున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా వర్మ సినిమాలు తీయాలని జగన్ అడిగాడట. ఓ మూడు సినిమాలను ప్లాన్ చేయాలని అడిగాడని కొందరు.. రెండు సినిమాలు తీసి పెట్టాలని ఇంకొందరు ఇలా ఎవరికి నచ్చినట్టుగా వారు వార్తలు రాసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్, మూడు పెళ్లిళ్ల మీద ఓ సినిమా తీయాలని అడిగాడట. చంద్రబాబు నాయుడు, టీడీపీకి వ్యతిరేకంగా మరో సినిమా తీయాలని అడిగాడట.
ఇక తన బయోపిక్ తీయాలని కూడా జగన్ అడిగాడంటూ కథనాలు వస్తున్నాయి. ఇలా మూడు సినిమాలకోసం ఆర్జీవీని పిలిపించుకున్నారని టాక్. అయితే ఇది ఒక పిచ్చి చర్య అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వర్మ ఎప్పుడో ఫాం కోల్పోయాడని, అతని ఏం తీసినా జనాలు చూడటం మానేశారని, వర్మతో పెట్టుకుంటే.. వైసీపీకే మరింత డ్యామేజ్ అవుతుందని అందరూ అంటున్నారు.
ఇక వైఎస్ జగన్ బయోపిక్ గనుక వర్మ తీస్తే అది మరింత బ్యాడ్ అవుతుందనే అనుమానం వైసీపీ బ్యాచులోనే ఉందని తెలుస్తోంది. మరి వర్మ, జగన్ ఇద్దరూ నిజంగా ఏం మాట్లాడుకున్నారు?ఏం చర్చించుకున్నారు? సినిమాల కోసమేనా? అన్నది వారిద్దరికే తెలియాలి. ఒక వేళ వర్మ సినిమాలు తీసినా వాటి ప్రభావం ఏమాత్రం ఉండదని సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఇద్దరి భేటీ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఆల్రెడీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇది వరకే అమ్మరాజ్యంలో కడపబిడ్డలు, పవర్ స్టార్ అంటూ ఇలా పిచ్చి పిచ్చి చిత్రాలన్నీ కూడా వర్మ తీసిన సంగతి తెలిసిందే.
Also Read : Jr NTR - Chiranjeevi : నాడు అలా నేడు ఇలా.. చిరంజీవిపై యంగ్ టైగర్.. ఎన్టీఆర్‌లో ఎంత మార్పు?
Also Read : Puri Jagannadh Complaint : పూరి ఫిర్యాదు.. ఫైనాన్షియర్ శోభన్ సంచలన వ్యాఖ్యలు.. ఎక్కడా కనిపించని ఛార్మీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి