Eagle OTT Streaming: ప్రముఖ ఓటీటీ చేతికి చిక్కిన రవితేజ ఈగల్ మూవీ స్ట్రీమింగ్ హక్కులు..

Ravi Teja - Eagle Movie OTT Streaming: మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్‌గా 'ఈగల్‌' మూవీతో పలకరించాడు. సంక్రాంతి పోటీ కారణంగా లేట్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర రెండు వారాల పరుగును పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కలును ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ భారీ రేటుకు దక్కించుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 23, 2024, 04:30 PM IST
Eagle OTT Streaming: ప్రముఖ ఓటీటీ చేతికి చిక్కిన రవితేజ ఈగల్ మూవీ స్ట్రీమింగ్ హక్కులు..

Ravi Teja - Eagle Movie OTT Streaming: రవితేజ హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్‌గా 'ఈగల్' మూవీతో పలకరించాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున నిర్మించింది. ఈ నెల 9న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అందకు తగ్గట్టు ఈ సినిమా వసూళ్లను సాధించడంలో వెనకబడింది.

మాస్ మహారాజ్ రవితేజ.. గతేడాది వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పలకరించారు. అందులో మెగాస్టార్  తమ్ముడిగా నటించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయినా.. ఆ క్రెడిట్ మొత్తం చిరు ఖాతాలోకి వెళ్లింది. తాజాగా రవితేజ 'ఈగల్‌' మూవీతో పలకరించాడు. పొంగల్ పోటీలో విడుదల కావాల్సిన ఈ సినిమా తీవ్ర పోటీ కారణంగా లేట్‌గా థియేటర్స్‌లో విడుదలైంది.  

ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన వసూళ్ల విషయానికొస్తే.. తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 14 కోట్ల షేర్ (రూ. 25 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్ల షేర్ (రూ. 36 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా ఓటీటీ డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ఈటీవీ విన్ కొనుగోలు చేసింది. శివరాత్రి కానుకగా మార్చి 8న ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానున్నట్టు సమాచారం. మరోవైపు ఈ మూవీ శాటిలైట్ హక్కులను కూడా ఈటీవీ కొనుగోలు చేసినట్టు సమాచారం.  

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 3 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది.

ఇక రవితేజ నటించిన 'ఈగల్' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

తెలంగాణ (నైజాం).. రూ. 6 కోట్లు..
రాయలసీమ (సీడెడ్).. రూ. 2.5 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్.. రూ. 8.5 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి .. రూ. 17 కోట్లు..
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 2 కోట్లు..
ఓవర్సీస్.. రూ. 2 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే .. బాక్సాఫీస్ దగ్గర రూ. 22 కోట్లు రాబడితే కానీ.. హిట్ అనిపించుకోదు. కానీ ఇప్పటికీ ఈ మూవీ రూ. 3 కోట్ల దూరంలో ఉండిపోయింది.
'ఈగల్' మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరోగా రవితేజతో పాటు అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ముఖ్యపాత్రల్లో నటించారు.ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. దాంతో పాటు రచన, ఎడిటింగ్  నిర్వహించారు. సంగీతం దావ్జాంద్ అందించారు. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల భారీ ఎత్తున లావిష్‌గా నిర్మించారు.రవితేజ సినిమాల విషయానికొస్తే.. క్రాక్ తర్వాత మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పవర్ఫుల్  సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో హిందీ రీమేక్ 'రెయిడ్' మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్ ఖరారు చేసారు. గతంలో వీళ్ల కాంబినేషన్‌లో షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. ఇపుడు రాబోతున్న 'మిస్టర్ బచ్చన్‌' మూవీ పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి.

Also Read: Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్‌, ధర పరంగా ఇదే బెస్ట్‌!

Also Read: Movies Postponed: 'వ్యూహం, శపథం' మళ్లీ వాయిదా.. నారా లోకేశ్‌కు ఆర్జీవీ అదిరిపోయే పంచ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News