/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

Ravi Teja’s Krack movie trailer released | టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్, క్రాక్ సినిమా (krack movie) సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ క్రమంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుక్రవారం క్రాక్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ ట్రైలర్‌లోని సన్నివేశాలు, డైలాగ్స్ మాస్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. మరోసారి హీరో రవితేజ ( Ravi Teja ) పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

క్రాక్ సినిమాలో రవితేజ సరసన శృతిహాస‌న్ (Shruti Haasan) నటించింది. ఈ చిత్రాన్ని గోపిచంద్ మ‌లినేని తెర‌కెక్కించగా.. స‌ర‌స్వతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మించారు. ఎస్. త‌మ‌న్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో స‌ముద్రఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలాఉంటే.. క్రాక్ సినిమాకు విక్టరీ వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్ ఇస్తుండ‌డం విశేషం. Also Read: Shruti Haasan: శృతి హాసన్.. గ్లామరస్ ఫొటోలు వైరల్

అయితే కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా ఈ సినిమా సైతం OTT ప్లాట్‌ఫామ్‌పైనే విడుదల అవుతుందని ఇటీవల కాలంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాను థియేటర్లల్లో మాత్రమే విడుదల చేస్తామని దర్శకుడు గోపిచంద్ మలినేని ( Gopichand Malineni ) ప్రకటించారు. గోపిచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న మరో మూవీ.. క్రాక్ టాలీవుడ్ (Tollywood) మాస్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలంటే.. సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. Also Read: Disha Patani: ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ దిశా పటానీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Ravi Teja’s Krack movie trailer released
News Source: 
Home Title: 

Ravi Teja: దుమ్ములేపుతున్న క్రాక్ మూవీ ట్రైలర్

Ravi Teja: దుమ్ములేపుతున్న క్రాక్ మూవీ ట్రైలర్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Ravi Teja: దుమ్ములేపుతున్న క్రాక్ మూవీ ట్రైలర్
Publish Later: 
No
Publish At: 
Friday, January 1, 2021 - 12:40
Created By: 
Shaik Madar Saheb
Updated By: 
Shaik Madar Saheb
Published By: 
Shaik Madar Saheb
Request Count: 
113