Ravanasura Movie Review : రావణాసుర రివ్యూ.. లాజిక్స్ వెతికితే కష్టమేరా

Ravanasura Movie Review రావణాసుర మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. మొదటి సారిగా విలన్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను పోషించాడు రవితేజ. సుశాంత్, రవితేజ, ఐదుగురు కథానాయికలు కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2023, 12:54 PM IST
  • రావణాసురతో రవితేజ సందడి
  • థియేటర్లోకి వచ్చిన మాస్ మహారాజ
  • విలన్‌గా మెప్పించాడా? లేదా?
Ravanasura Movie Review : రావణాసుర రివ్యూ.. లాజిక్స్ వెతికితే కష్టమేరా

Ravanasura Movie Review సుధీర్ వర్మ సినిమాలు సక్సెస్ అయినా కాకపోయినా ఆయన టేకింగ్ మీద అందరికీ అంచనాలుంటాయి. ఇక అలాంటి డైరెక్టర్‌ మాస్ మహారాజా రవితేజను నెగెటివ్ షేడ్స్‌లో చూపించడం, శ్రీకాంత్ విస్సా ఇచ్చిన కథ, ఐదుగురు కథానాయికలు ఉండటం, సుశాంత్ స్పెషల్ రోల్ చేయడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఎలా ఉంది.. ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అన్నది చూద్దాం.

కథ
రవీంద్ర (రవితేజ) తన జూనియర్ అయిన కనకమహాలక్ష్మీ (ఫరియా) వద్ద జూ.లాయర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలోనే హారిక తల్వార్ (మేఘా ఆకాశ్) తండ్రి (సంపత్) ఓ హత్య కేసులో అరెస్ట్ అవుతాడు. ఆయన్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం రవీంద్రతో హారికకు పరిచయం ఏర్పడుతుంది. సిటీలో కంటిన్యూగా జరిగే హత్యలను కమిషనర్‌ నరసింహా మూర్తి (మురళీ శర్మ) ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఏపీసీ హన్మంతరావు (జయరామ్‌)ను నియమిస్తాడు. అయితే ఈ క్రమంలోనే రవీంద్ర హారికను రేప్ అండ్ మర్డర్ చేస్తాడు. హారిక తండ్రి జైలుకు వెళ్లేందుకు కారణం కూడా రవీంద్రనే. ఇలా రవీంద్ర ఓ డాక్టర్, కమిషనర్‌, ఇద్దరు రౌడీలను ఇలా అందరినీ చంపేస్తాడు. అసలు రవీంద్ర ఇలా వరుసగా ఎందుకు హత్యలు చేస్తాడు? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ కథలో సాకేత్ (సుశాంత్) పాత్ర ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

నటీనటులు
రవీంద్ర పాత్ర రవితేజకు కాస్త కొత్తగానే అనిపిస్తుంది. ప్రథమార్థంలో రవితేజను చూస్తే నిజంగానే విలన్‌ అనిపిస్తాడు. కానీ ద్వితీయార్థం, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌కు వచ్చే సరికి రొటీన్ అనిపిస్తుంది. అయితే వేరియేషన్స్‌ చూపించడంలో మాత్రం రవితేజ దుమ్ములేపేశాడు. విలనిజం పండించడంలో సక్సెస్ అయ్యాడు. ఉన్న ఐదుగురు హీరోయిన్లలో అందరికీ మంచి పాత్రలే పడ్డాయి. అను ఇమాన్యుయేల్‌కే కాస్త స్క్రీన్ స్పేస్, నటించేందుకు తక్కువ స్కోప్ దక్కినట్టు అనిపిస్తుంది. ఫరియా, పూజిత, దక్ష ఇలా అందరికీ మంచి పాత్రలే పడ్డాయి. శ్రీరామ్, సంపత్, జయరామ్, మురళీ శర్మ వంటి వారు అంతా కూడా మెప్పిస్తారు.

విశ్లేషణ

రివేంజ్ డ్రామాలు తెరపై వస్తూనే ఉంటాయి. అయితే ఆ రివేంజ్‌ను తీసుకునే మార్గాలు వేర్వేరుగా ఉంటాయి. ప్రథమార్థంలో హీరోను విలన్‌గా చూపిస్తారు.. ద్వితీయార్థంలో ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండటం, హీరో కుటుంబం చితికి పోవడం, తన వాళ్లకు ఏదైనా అన్యాయం జరగడం ద్వారా.. విలన్లను ఏరిపారేస్తుంటాడు. ఈ కాన్సెప్ట్‌లు మనం ఇది వరకు ఎన్నో చూశాం. హీరోలు అనేవాళ్లు ఉండరు అని క్యాప్షన్ పెట్టడంతో ఏదైనా కొత్తగా ఉంటుందని అంతా ఆశిస్తారు. అయితే ఇది బెంగాలీలో వచ్చిన విన్సిడా సినిమాకు రీమేక్ అన్న సంగతి చాలా మందికి తెలియదు.

ఈ కథలో శ్రీకాంత్ విస్సా చేసిన మార్పులు, సుధీర్ వర్మ టేకింగ్ ఏ మాత్రం కొత్తగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ వరకు ఎంతో క్యూరియాసిటీ పెంచేసిన సుధీర్ వర్మ.. రెండో హాఫ్‌లో నిరుగార్చినట్టుగా కనిపిస్తుంది. విలన్‌గా రవితేజ.. మెప్పించాడని అనుకున్న ఆడియెన్స్‌కు ద్వితీయార్థం ఉసూరమనిపిస్తుంది. రొటీన్ రివేంజ్‌ అని, అందుకే ఇలా అందరినీ హత్యలు చేస్తున్నాడని తెలిశాక.. రావణాసురు అనిపించడు.. రాముడిగా అనిపిస్తాడు. 

అయితే ఇందులో ఎన్నో లాజిక్ లేని సీన్లు ఉంటాయి. మొహం మార్చినంత మాత్రాన శరీర రూపు రేఖలు ఎలా మారిపోతాయి? అని ప్రేక్షకులు ఆలోచిస్తే సినిమాను చూడటం కష్టమే. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు ఏ మంతగా ఎక్కవు. మాటలు పర్వాలేదనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్‌ ఎఫెక్టివ్‌గా అనిపించవు. నిర్మాణ విలువలు ఉన్నతంగా అనిపిస్తాయి.

రేటింగ్ : 2.5

బాటమ్ లైన్‌ : రావణాసుర.. రొటీన్ రివేంజ్ డ్రామానేరా!

Also Read:  Padma Awards 2023 : గర్వంగా ఉంది పెద్దన్న.. కీరవాణిపై రాజమౌళి ట్వీట్

Also Read: Samantha Ruth Prabhu : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అతడికి ఐలవ్యూ చెప్పిన సమంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News