Tiger Nageswara Rao : మళ్లీ అదే తప్పు చేసిన రవితేజ.. అందుకే ఇలా అయ్యిందా!!

Ravi Teja : దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలైన రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా షూటింగ్ దగ్గర నుంచి ఈ చిత్రంపై రవితేజ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించడంతో.. రవితేజ కూడా పాన్ ఇండియా హీరో అయిపోతున్నారు అని ఆనందపడిపోయారు. కానీ వారి అంచనాలు అన్నీ తలకిందులు చేస్తూ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి నెగిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2023, 07:14 AM IST
Tiger Nageswara Rao : మళ్లీ అదే తప్పు చేసిన రవితేజ.. అందుకే ఇలా అయ్యిందా!!

Tiger Nageswara Rao : రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాపై రవితేజ ఎంత నమ్మకం పెట్టుకున్నారు అంటే ఇది తన మొదటి పాన్ ఇండియా సినిమాగా చేశారు ఈ హీరో. ఈ సినిమా పైన ఎక్కువ నమ్మకం లేకపోతే హిందీలో భారీ లెవెల్ లో కూడా ప్రమోషన్స్ చేసి ఉండరు.‌ కానీ రవితేజ ఇంతలా నమ్మిన ఈ సినిమా మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.

కాగా ఈ సినిమా చూసిన కొంతమంది మాత్రం టైగర్ నాగేశ్వరరావు మరీ తీసి పడేయాల్సిన సినిమా కాదు అని ఈ సినిమాలో కూడా చాలా హైలెట్స్ ఉన్నాయి అని అంటున్నారు. ముఖ్యంగా కొన్ని ఎపిసోడ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి అని కూడా కామెంట్లు పెడుతున్నారు. కాగా మధ్య మధ్యలో బాగానే ఉన్నా మొత్తం మీద మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ తన కథ చిత్రం రావణాసురలో చేసిన తప్పులే చేశారు అని అందుకే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయిందని కొంతమంది ఇప్పుడు ఒక కొత్త థియరీ తెచ్చి సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఇంతకీ ఆ కొత్త థియరీ ఏమిటి అంటే ఈ సినిమాలోనూ అలానే రావణాసుర సినిమాలోని రెండిటిలో కూడా రవితేజ కొన్ని నెగిటివ్ సీన్స్ లో కనిపివ్వదమే.

టైగర్ నాగేశ్వరరావు సినిమా విషయానికి వస్తే ప్రేక్షకులకు ఏమాత్రం రుచించని కొన్ని సీన్లు ఉన్నాయి. వాటి వల్ల నిడివి పెరిగిందే తప్ప ప్రయోజనం లేకపోయింది.  తన సొంత తండ్రిని చంపే క్రూరుడైన కొడుగ్గా.. ఒక వేశ్య తాను అడగ్గాడే దగ్గరికి రాలేదని అందరి ముందు కడుపు మీద తన్ని కిరాతకంగా ప్రవర్తించే మగవాడిలా అలానే తాను.. ప్రేమించిన అమ్మాయితో కూడా చాలా అసభ్యంగా మాట్లాడే వ్యక్తిగా.. హత్యలు చేసే దొంగల రవితేజను చూడటం ప్రేక్షకులకు.. ఆఖరికి రవితేజ అభిమానులకు కూడా పెద్దగా ఎక్కలేదు. ఇంతకుముందు రవితేజ చేసిన ‘రావణాసుర’లో కూడా ఇలాంటి కొన్ని సీన్లు ఉన్నాయి. ఆ సీన్లన్నీ ఎబ్బెట్టుగా అనిపించాయి. 

ఒక హీరో ని నెగిటివ్ షేర్స్ తో చూపిస్తున్నాము అంటే తప్పకుండా అది ప్రేక్షకులను కన్విన్స్ చేసే విధంగా ఉండాలి. కానీ ఆ కన్వెన్సింగ్ పాయింట్ అనేది రెండు సినిమాలలో తేడా కొత్తదంతో అలానే రవితేజ అభిమానులు సైతం ఆయన్ని అలా చూడలేక పోవడంతో ఈ రెండు సినిమాలు మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాల్లో హీరోని నెగిటివ్ గా చూపించిన ఆఖరికి ఆ నెగిటివ్ క్యారెక్టర్ని జస్టిఫికేషన్ చేసుకోవడం కోసం డైరెక్టర్లు రాసిన పాయింట్లు బలంగా ఉన్నాయి. కానీ టైగర్ నాగేశ్వరరావు క్లైమాక్స్ లో మాత్రం డైరెక్టర్ పాయింట్స్ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. ఇది టైగర్ నాగేశ్వరరావు నిజజీవితం ఆధారంగా తీసిన సినిమా అయినా కొన్ని అనవసరమైన సన్నివేశాలు పెట్టకుండా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఎంటర్టైనర్లకు పేరుపడ్డ రవితేజకు ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మరి అలాంటి రవితేజ తన సినిమాల్లో ఇలాంటి సీన్లు పెడితే అవి ఇబ్బందిగా మారవచ్చని కాబట్టి ఇక నుంచి అయినా రవితేజ ఈ విషయం మైండ్ లో పెట్టుకొని సినిమా చెయ్యడం మంచిది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Also Read: Karampudi Man Death News: కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. భార్య బిడ్డకు జన్మనిచ్చిన ఆసుపత్రికే భర్త మృతదేహం

Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News