Ravi Teja - Eagle: 'ఈగల్‌' సహా రవితేజ రీసెంట్ మూవీస్ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఫ్లాప్స్ ఉన్న ఎక్కడా తగ్గని మాస్ మహారాజ్ జోరు..

Ravi Teja - recent movies total box office collections: మాస్ మహారాజ్ రవితేజ  ఈ యేడాది 'ఈగిల్' మూవీతో పలకరించారు. ఈ సినిమా యావరేజ్ టాక్‌తో కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా టోటల్‌ కలెక్షన్స్‌తో పాటు రవితేజ రీసెంట్ మూవీస్ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 25, 2024, 10:09 AM IST
Ravi Teja - Eagle: 'ఈగల్‌' సహా రవితేజ రీసెంట్ మూవీస్ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఫ్లాప్స్ ఉన్న ఎక్కడా తగ్గని మాస్ మహారాజ్ జోరు..

Ravi Teja - recent movies total box office collections: కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగిల్ మూవీ. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున నిర్మించింది. ఈ సినిమాలో రవితేజ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈసినిమా టాక్‌కు తగ్గట్టు వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఈ సినిమా టోటల్ రన్‌లో రూ. 16.89 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర అబౌ యావరేజ్‌గా నిలిచింది.

ఈగల్.. రూ. 21 కోట్లు..
టైగర్ నాగేశ్వరరావు .. రూ. 37.50 కోట్లు
రావాణాసుర.. రూ. 22.20 కోట్లు
ధమాకా... రూ. 18.60 కోట్ల షేర్
రామారావు ఆన్ డ్యూటీ.. రూ. 17.20 కోట్ల షేర్
ఖిలాడి.. రూ. 22.80 కోట్ల షేర్
క్రాక్.. రూ. 17 కోట్ల షేర్
డిస్కో రాజా.. రూ.19.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసాయి. మరి తాజాగా విడుదలైన 'ఈగల్' మూవీ టాక్ బాగున్నా.. అనుకున్నంత రేంజ్‌లో వసూళ్లను రాబట్టలేకపోయిందనే చెప్పాలి.

రవితేజ రీసెంట్ మూవీ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

ఈగిల్ మూవీ.. రూ. 16.89 కోట్ల సేసే
టైగర్ నాగేశ్వరరావు - రూ. 25.50 కోట్ల షేర్
రావణాసుర.. రూ. 12.02 కోట్ల షేర్
ధమాకా.. రూ. 45.06 కోట్ల షేర్
రామారావు ఆన్ డ్యూటీ.. రూ. 5.20 కోట్ల షేర్..
మొత్తంగా రవితేజ గత ఐదు చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్స్ కలిపితే.. రూ. 104.67 కోట్లు..
యావరేజ్‌గా ఒక్కో మూవీ .. రూ. 20.93 కోట్ల షేర్ రాబట్టింది.  మొత్తంగా ధమాకా తర్వాత ఆ రేంజ్‌ హిట్ కొట్టలేకపోయాడు రవితేజ.

'ఈగల్' మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరోగా రవితేజతో పాటు అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల లీడ్ రోల్లో యాక్ట్ చేసారు. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. దాంతో పాటు రచన, ఎడిటింగ్  నిర్వహించారు. సంగీతం దావ్జాంద్ అందించారు. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల భారీ ఎత్తున లావిష్‌గా నిర్మించారు. రవితేజ సినిమాల విషయానికొస్తే.. క్రాక్ తర్వాత మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో హిందీ రీమేక్ 'రెయిడ్' మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్ ఖరారు చేసారు. గతంలో వీళ్ల కాంబినేషన్‌లో షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. ఇపుడు రాబోతున్న 'మిస్టర్ బచ్చన్‌' మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి.

Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News