Ravi Teja Dhamaka : చిన్నప్పటి నుంచి అంతే.. అది చిరంజీవే స్టార్ట్ చేశాడు.. రవితేజ కామెంట్స్

Dhamaka Promotions మాస్ మహారాజా రవితేజ హీరోగా రాబోతోన్న ధమాకా సినిమా రేపు విడుదల కానుంది. ఈక్రమంలో రవితేజ మీడియాతో ముచ్చటించాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు రవితేజ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పుకొచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2022, 09:00 PM IST
  • రేపే రాబోతోన్న ధమాకా సినిమా
  • కమర్షియల్ సినిమాలపై రవితేజ
  • వాల్తేరు వీరయ్యపై మాస్ మహారాజా
Ravi Teja Dhamaka : చిన్నప్పటి నుంచి అంతే.. అది చిరంజీవే స్టార్ట్ చేశాడు.. రవితేజ కామెంట్స్

Ravi Teja in Dhamaka Promotions మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. రేపే ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి హాట్ టాపిక్ అవుతోంది. రవితేజ తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాల మీద స్పందించాడు. తన కొడుకు ఎంట్రీ మీద, చిరంజీవి వాల్తేరు వీరయ్యలో చేసిన పాత్ర మీద రియాక్ట్ అయ్యాడు. 

వాల్తేరు వీరయ్య సినిమా గురించి స్పందిస్తూ.. పవర్ ఫుల్ కారెక్టర్ చేస్తున్నానని, పండక్కి చూసి మీరు చెప్పండని అన్నాడు. చిరంజీవి గారంటే తనకు చాలా ఇష్టమని, అన్నయ్యతో సినిమా చేయడం గొప్ప అనుభవమని చెప్పుకొచ్చాడు. కథ, క్యారెక్టర్ అద్భుతంగా కుదిరాయని చెప్పుకొచ్చాడు.

తన కొడుకు ఎంట్రీపై రవితేజ కామెంట్ చేశాడు. దానికి ఇంకా చాలా టైమ్ వుందని అన్నాడు. ప్రస్తుతానికి ఆలోచనే లేదని, ఇంకా చదువుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. తెలుగులో ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు మొదలుపెట్టింది చిరంజీవి అని, తర్వాత తామంతా ఫాలో అయ్యామని చెప్పుకొచ్చాడు. ఇక ధమాకా అయితే రౌడీ అల్లుడు స్టైల్లో ఉంటుందని, ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమానే అని, అందులో ఎలాంటి సందేహం లేదని రవితేజ చెప్పుకొచ్చాడు.

రవితేజ తన పాజిటివ్ నేచర్ గురించి చెప్పుకొచ్చాడు. తనకు ఊహ తెలిసినప్పటికీ నుండి ఇలానే వున్నానని, నెగిటివిటీ పక్కన పెట్టేసి ఆనందంగా పాజిటివ్ గా ఉండటమే తెలుసని అన్నాడు. తన స్ట్రగుల్‌ని కూడా ఎంజాయ్ చేశానంటూ చెప్పుకొచ్చాడు. తన లైఫ్ లో ఎలాంటి రిగ్రేట్ లేదని, తాను ఎలాంటి ఒత్తిడిని తీసుకోనంటూ చెప్పుకొచ్చాడు.

Also Read : Ram Charan RC15 Look : శంకర్ దిల్ రాజులకు మళ్లీ దెబ్బ.. రామ్ చరణ్ లుక్ లీక్.. వీడియో వైరల్

Also Read : Geetha Madhuri Husband : గుర్తు పట్టలేనంతగా మారిన గీతూ మాధురి భర్త.. లుక్ బాలేదంటూ కష్టాన్ని గుర్తించని నెటిజన్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News