Rashmika Trolls: ఇప్పుడే లేచావా తల్లి.. రష్మిక మందన్నను ఆటాడుకుంటున్న మహేష్ బాబు ఫాన్స్!

Mahesh Babu fans trolls Rashmika after tweet about Indira Devi. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ రష్మిక మందన్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 29, 2022, 01:15 PM IST
  • ఇప్పుడే లేచావా తల్లి
  • రష్మికను ఆటాడుకుంటున్న మహేష్ ఫాన్స్
  • మహేష్‌ బాబు కుటుంబం తీవ్ర విషాదం
Rashmika Trolls: ఇప్పుడే లేచావా తల్లి.. రష్మిక మందన్నను ఆటాడుకుంటున్న మహేష్ బాబు ఫాన్స్!

Mahesh Babu fans trolls Rashmika after tweet about Indira Devi: సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, స్టార్ హీరో మహేశ్‌ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం (సెప్టెంబర్‌ 28) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి.. హైదరాబాద్‌లోని నివాసంలో కన్నుమూశారు. ఈ ఏడాది జనవరిలో ఇందిరా దేవి పెద్ద కుమారుడు రమేష్‌ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఇంతలోనే ఇందిరా దేవి కన్ను మూయడంతో మహేష్‌ బాబు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ఇందిరా దేవి మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. వెంకటేష్, మంచు మోహన్‌ బాబు, నాగార్జున, మంచు విష్ణు, దగ్గుబాటి రానా, అడివి శేషు, విజయ్‌ దేవరకొండ, గోపీచంద్, జీవితా రాజశేఖర్ తదితరులు ఇందిరా దేవి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రతిఒక్కరు కృష్ణ, మహేష్‌ బాబు, నమ్రతా శిరోద్కర్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. 

మహేష్ బాబు ఇంటికి రాలేని పరిస్థితిలో ఉన్న వారు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. అయితే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మాత్రం ఈరోజు ఓ ట్వీట్ చేశారు. 'మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా అమ్మా' అని నేషనల్ క్రష్ ట్వీటారు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. ఈ ట్వీట్ చూసిన సూపర్ స్టార్ ఫాన్స్ రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఎటు పోయారు మేడమ్, ఇప్పుడే లేచావా తల్లి అంటూ విమర్శలు చేస్తున్నారు. 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక నటించిన విషయం తెలిసిందే. 

Also Read: Supreme Court: భార్యను బలవంతం చేసినా అత్యాచారమే.. అబార్షన్ చట్టబద్దమే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 

Also Read: UP Accident: బస్సు, ట్రక్కు ఢీ... 10 మంది దుర్మరణం, 41 మందికి గాయాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News