Rashmika Mandanna sankranthi celebrations: విజయ్ దేవరకొండ ఇంట్లోనే రష్మిక సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుందా ?

Rashmika Mandanna sankranthi celebrations: : రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి సంక్రాంతి సంబురాలు చేసుకున్నారట. సంక్రాంతి సందర్భంగా కుటుంబంతో గడిపిన ఒక ఫోటోను పోస్ట్ చేశాడు విజయ్‌ దేవరకొండ. అయితే సేమ్ అలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోనే పోస్ట్ చేసింది రష్మిక.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 09:58 PM IST
  • రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ సంక్రాంతి సంబురాలు..
  • సంక్రాంతి సందర్భంగా కుటుంబంతో గడిపిన ఫోటోను పోస్ట్ చేసిన విజయ్‌ దేవరకొండ
  • సేమ్ అలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోనే సోషల్ మీడియాలో షేర్ చేసిన రష్మిక
Rashmika Mandanna sankranthi celebrations: విజయ్ దేవరకొండ ఇంట్లోనే రష్మిక సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుందా ?

Rashmika Mandanna celebrated Sankranthi festival in Vijay Deverakonda’s House? : సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లోకి వెళ్లింది రష్మిక మందన్నా. ఇక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీలతో రష్మిక మందన్న, (Rashmika Mandanna) విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) జోడీ అందరికీ నచ్చింది. ఈ జోడీ కూడా తమ అద్భుతమైన నటన, కెమిస్ట్రీతో సినీ అభిమానులను అలరించింది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో (Social media) చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

సంక్రాంతి (sankranthi) సందర్భంగా ఈ రౌడీ.. తన కుటుంబంతో తన ఇంట్లో గడిపిన సందర్భానికి సంబంధించిన ఒక ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో విజయ్ తల్లిదండ్రులు, (Vijay's parents) తమ్ముడు ఆనంద్ దేవరకొండతో (Anand Devarakonda) పాటు వారి పెంపుడు కుక్క, ఇంటి గార్డెన్ కనిపిస్తుంది. 

అయితే రష్మిక కూడా సేమ్ అలాంటి బ్యాక్‌గ్రౌండ్ (Background) ఉన్న ఫోటోనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ ఇంట్లోనే సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుందని టాక్ నడుస్తోంది. విజయ్ దేవరకొండతో కుటుంబంతో కలిసి రష్మిక పండుగను (Festival) సెలబ్రేట్ చేసుకుందని అంటున్నారు నెటిజెన్లు. 

గతంలో కూడా రష్మిక (Rashmika) మందన విజయ్ దేవరకొండతో కలిసి గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (New Year Celebrations) జరుపుకుందని వార్తలు వచ్చాయి. అలాగే ఈ జంట గతంలో ముంబైలో కూడా కనిపించింది. 

రష్మిక త్వరలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR‌) సరసన ఒక మూవీలో నటించనుందట. తారక్‌ కొరటాల శివతో ఎన్టీఆర్‌ 30 మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పాన్‌ ఇండియా స్థాయి మూవీలో ఎన్టీఆర్‌కు సరసన రష్మిక నటిస్తుందని తెలుస్తోంది. 

Also Read : Khushi Kapoor Photos: బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి కుమార్తె ఖుషీ కపూర్

అలాగే రష్మిక.. విజయ్ తర్వాతి మూవీలో హీరోయిన్‌గా నటిస్తుందట. అలాగే ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీలో కూడా ఈ అమ్మడు నటిస్తోంది. అలాగే రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో వస్తోన్న ఒక మూవీలో కూడా రష్మిక (Rashmika) నటిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పూరీ జ‌గ‌న్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న లైగర్‌‌ మూవీలో నటిస్తున్నాడు.

Also Read : Shweta Basu Prasad Photos: కొత్త బంగారు లోకం మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News