Deepika Padukone : దీపిక కారులో నుంచి దిగుతుండగా డోర్ తెరిచిన రణవీర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Ranveer Singh opens car door for Deepika Padukone : బాలీవుడ్‌ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె సోషల్ మీడియాలో తరుచూ ఏదో విషయంలో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా దీపిక కారులో నుంచి దిగుతుండగా.. రణవీర్ డోర్ తెరిచాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2021, 03:13 PM IST
  • బాలీవుడ్‌ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె వీడియో వైరల్
  • స్టైలిష్‌ లుక్‌తో రణవీర్..
  • భార్య కారులో నుంచి దిగుతుండగా డోర్ తెరిచిన రణవీర్
  • సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న వీడియో
Deepika Padukone : దీపిక కారులో నుంచి దిగుతుండగా డోర్ తెరిచిన రణవీర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Ranveer Singh opens car door for Deepika Padukone Ranveer Singh rocks cowboy hat while Deepika wears thigh high boots : బాలీవుడ్‌ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె సోషల్ మీడియాలో తరుచూ ఏదో విషయంలో వైరల్ అవుతూ ఉంటారు. ఇటీవల ముంబై విమానాశ్రయంలో (Mumbai airport) ఈ జంట కనిపించింది. ట్రెండింగ్ ఫ్యాషన్ ఫాలో అవ్వడంలో వీరిద్దరూ ముందుంటారు. 

సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ షేర్ చేసిన వీడియోలో రణవీర్ సింగ్, దీపికా పదుకొణెల లేటెస్ట్ స్టైల్.. స్టిల్ అదిరింది. దీపికా లేత గోధుమరంగు బాటమ్‌.. వైట్‌ టాప్‌లో తళుక్కుమంది. రణ్‌వీర్ సింగ్ లెదర్ జాకెట్, వైట్‌ టీ-షర్ట్ ధరించి.. తలపై క్యాప్‌తో స్టైలిష్ లుక్‌లో కనిపించారు. 

ఈ భార్యాభర్తల బంధం కూడా చాలా బాగుంటుంది. దీపిక కారులో నుంచి దిగుతుండగా.. రణవీర్ డోర్ తెరిచాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోపై ఓ లుక్కేయండి..

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

 

రణవీర్ సింగ్, (Ranveer Singh) దీపికా పదుకొణెలకు (Deepika Padukone) సంబంధించిన వీడియోలపై, ఫోటోలపై నిత్యం సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. కొందరు వీరిని ట్రోల్ చేస్తుంటారు. ఇక తాజా వీడియోపై కూడా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఈ జంటను ప్రశంసిస్తుండగా.. మరికొందరేమో రణవీర్ సింగ్‌పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత ఉదయమే కౌబాయ్ మాదిరిగా తయారై ఎవరైనా వస్తారా.. అంటూ కొందరు.. రణవీర్ సింగ్, దీపికా పదుకొణె సింప్లీ సూపర్బ్‌గా ఉన్నారంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read : Kiara Advani: కియారా అద్వానీ ఆగ్రహానికి కారణమేంటి

ఇక వైరల్ భయాని (Viral Bhayani) పేజీలో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె జంటకు సంబంధించిన మరికొన్ని ఫోటోలు అప్‌లోడ్ అయ్యాయి. వాటిపై కూడా నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 

దీపికా ప‌దుకొణె తాజాగా 83 మూవీలో ర‌ణ్‌వీర్ (Ranveer Singh) స‌ర‌స‌న న‌టిచింది. ఈ మూవీ తాజాగా రిలీజ్ అయింది. సినిమా ప్ర‌మోష‌న్‌ చేసే పనిలో ఈ జంట ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. 1983లో టీంఇండియా మొదటిసారి వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకుని 83 మూవీ (83 movie) తెరకెక్కింది. ఈ మూవీలో నటించడమే కాదూ.. నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించింది దీపికా పదుకొణె (Deepika Padukone).

Also Read : RRR Movie Effect: RRR సినిమా ప్రభావం బాలీవుడ్‌పై తీవ్రంగా ఉండనుందా..ఎందుకు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News