/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మరో వివాదాస్పద చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సారి అది ఫీచర్ ఫిల్మ్ రూపంలో కాదు.. ఒక వెబ్ సిరీస్ రూపంలో. గతంలో రక్తచరిత్ర, వంగవీటి లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంపొందించిన వర్మ ఇప్పుడు ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’ పేరుతో వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించడానికి శ్రీకారం చుట్టునున్నారు. గన్స్ అండ్ థైస్ సిరీస్ తర్వాత తాను తీస్తున్న మొట్టమొదటి తెలుగు ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ "కడప" అని ఆయన ఇటీవలే ప్రకటించారు.

ఫ్యాక్షనిజం ఎలా పుట్టిందో.. కడపలో అనేక రోజులు రక్తం ఏరులై పారడానికి కారణం ఏమిటో తాను ఈ సిరీస్ ద్వారా వెలుగులోకి తీసుకువస్తానని ప్రకటించిన వర్మ, ఇది ఒక హార్డ్ కోర్ చిత్రం అని ప్రకటించారు. ఇది ఒక పరిశోధనాత్మక చిత్రమని... ఎన్నో నిజాలు బయటకు తీయడానికి తాను ఈ చిత్రం తీయడానికి పూనుకున్నానని వర్మ తెలిపారు. రక్తచరిత్రలో తాను చూపింది కేవలం 5 శాతమేనని.. అంతకు మించి ఈ చిత్రం ఉంటుందని వర్మ అభిప్రాయపడ్డారు. 

"నేను డిజిటల్ ప్రపంచంలోకి రావడానికి ఒకే ఒక్క కారణం..వెండితెర మీద నన్ను నా ఇష్టం వచ్చినట్టు చెప్పనివ్వని కథల్ని ఎవడినీ కేర్ చెయ్యకుండా నాకిష్టం వచ్చినట్టు చెప్పడం కోసం. ఈ బ్యాక్ గ్రౌండ్‌లో మొత్తం వరల్డ్ ప్రేక్షకుల కోసం ముంబై మాఫియా బ్యాక్ గ్రౌండ్లో నేను నిర్మిస్తున్న గన్స్ అండ్ థైస్ సిరీస్ తర్వాత  (youtu.be/4pjTcLLciuU) నేను తీస్తున్న మొట్టమొదటి తెలుగు ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ "కడప". 

హింస, రక్తదాహం, ఆధిపత్యం, ఇగో, ఆశ, వెన్నుపోట్లు లాంటి రకరకాల మనిషి నైజాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఒక ప్రాంతం స్ఫూర్తిగా ఈ టైటిల్ పుట్టింది. రక్తచరిత్ర తీస్తున్నప్పటి నుంచి చాలా మంది మాజీ ఫ్యాక్షనిస్టులు, వాళ్ళ బాధితులు, వాళ్ల బంధువులు, వాళ్లింట్లో పని చేసే వాళ్ల నుంచి మరియు ఎందరి నుంచో నేను డబ్బులిచ్చి, బెదిరించి,మాటలతో మభ్యపెట్టి వాళ్లు గుండెల్లో దాచుకున్న రహస్యాలని బయటికి లాగేసిన మెటీరియల్ నుంచి పుట్టిందే ఈ "కడప" నిజం కథ. 

నేను ఈ సబ్జెక్ట్‌ని గతంలో రక్తచరిత్రలో డీల్ చేశాను కదా అని కొందరు ఇడియట్లు భావించవచ్చు. కానీ అది కేవలం 5% మాత్రమే నిజం. దానికి కారణం రక్తచరిత్రలో అసలు నిజాలని చాలా పైపైన చూపించాను. లోలోపలి పూర్తి నిజాలు అప్పటికి నాకు తెలియకపోవడం, కొన్ని  వార్నింగ్‌లు ఇచ్చి పుచ్చుకోవడం లాంటి ఇతరత్రా కారణాల వల్ల అసలు రాయలసీమ శరీరాన్ని పూర్తిగా బట్టలిప్పదీసి చూపించలేకపోయాను. 

దానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌లో భయాన్ని నూతిలోకి పారేసి, ఎవడేమి అనుకున్నా, ఎవ్వడేమి ఫీల్ అయినా కేర్ చెయ్యకుండా నిజం కథని నిజంగా చూపించడానికి సైకిల్ చెయిన్ మీద ఒట్టుగా కంకణం కట్టుకున్నాను. 

ఈ "కడప" వెబ్ సిరీస్ ట్రైలర్ రేపు..అంటే 15 డిసెంబర్ ఉదయం 10 గంటలకి రిలీజ్ అవ్వబోతోంది" అని రామ్‌గోపాల్‌వర్మ ఫేస్‌బుక్ వేదికగా బహిరంగ ప్రకటన చేశారు.

 

Section: 
English Title: 
Ramgopal varma's next web series is based on Kadapa and the bloodshed Reddy's stories
News Source: 
Home Title: 

అప్పుడు 'రక్త చరిత్ర'.. ఇప్పుడు 'కడప' చరిత్ర

అప్పుడు 'రక్త చరిత్ర'.. ఇప్పుడు 'కడప' చరిత్ర
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes