RRR Movie: 'ఆర్ఆర్ఆర్' నుంచి రామ్, భీమ్ కొత్త స్టిల్స్... ఫ్యాన్స్ ఫిదా...

Ramcharan and NTR latest stills from RRR: ఆర్ఆర్ఆర్ సినిమాలో రాంచరణ్, తారక్ లుక్స్‌కి సంబంధించి కొత్త స్టిల్స్ విడుదలయ్యాయి. పోలీస్ గెటప్‌లో రాంచరణ్, బ్లూ షర్ట్-ధోతీ గెటప్‌లో ఎన్టీఆర్ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2021, 03:09 PM IST
RRR Movie: 'ఆర్ఆర్ఆర్' నుంచి రామ్, భీమ్ కొత్త స్టిల్స్... ఫ్యాన్స్ ఫిదా...

Ramcharan and NTR latest stills from RRR: ఆర్ఆర్ఆర్ సినిమాలో రాంచరణ్, తారక్ లుక్స్‌కి సంబంధించి కొత్త స్టిల్స్ విడుదలయ్యాయి. పోలీస్ గెటప్‌లో రాంచరణ్, బ్లూ షర్ట్-ధోతీ గెటప్‌లో ఎన్టీఆర్ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. రామ్, భీమ్ పాత్రలకు సంబంధించిన ఈ స్టిల్స్‌ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ ట్విట్టర్ ఖాతాలో ఈ స్టిల్స్‌ను పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో చెర్రీ, తారక్, రాజమౌళి బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అటు నార్త్‌ను, ఇటు సౌత్‌ను కవర్ చేస్తూ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో ప్రమోషన్స్‌కి సంబంధించిన ప్రెస్ మీట్స్ నిర్వహించారు. చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రాంచరణ్ ఒకింత భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. చనిపోయేంతవరకూ తారక్‌తో అనుబంధం కొనసాగుతుందని రాంచరణ్ పేర్కొన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తారక్ రూపంలో తనకొక బ్రదర్ దొరికాడని.. అందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాని అన్నాడు.

మన్యం వీరులు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీమ్‌ల కల్పిత పాత్రలు, కల్పిత కథనాలతో ఆర్ఆర్ఆర్ సినిమాను (RRR Movie) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అల్లూరి, కొమురం భీమ్‌ల రియల్ లైఫ్‌కి, ఆర్ఆర్ఆర్ సినిమా కథకు సంబంధం లేదని ఇదివరకే రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలో రాంచరణ్ సరసన అలియా భట్, తారక్ సరసన ఒలీవియా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Shocking Viral Video: మిరాకిల్.. పిడుగుపడ్డా అతను బతికి బయటపడ్డాడు... వీడియో వైరల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News