Ram Says Sorry to Lingusamy: ఓ ప్రముఖ తమిళ దర్శకుడికి.. టాలీవుడ్ హీరో రామ్ పోతినేని సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. రామ్ పోతినేని తన ట్విట్టర్ వేదికగా సారీ చెబుతూ ఒక ట్వీట్ పెట్టారు. అసలు విషయానికి వస్తే రామ్ ప్రస్తుతం 'ది వారియర్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో రూపొందుతోంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆది పినిశెట్టి విలన్ గా నటించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే 'ది వారియర్' ప్రమోషన్‌ను సినిమా యూనిట్ ముందే ప్రారంభించింది. ఈ క్రమంలో 'విజిల్' అంటూ సాగే ఓ హై ఓల్టేజ్ సాంగ్ ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఆ సాంగ్ రిలీజ్ కోసం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ విజిల్ సాంగ్ తనకెంతో నచ్చిందని.. తమ చిత్రానికి ఇంతటి ఎనర్జిటిక్ మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్, సింగర్స్, నిర్మాతలు, ఇతర చిత్ర బృందానికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. అలానే స్టేజ్ మీద కొద్ది సేపు మాట్లాడిన ఆయన తన స్పీచ్‌లో దర్శకుడు లింగుస్వామి గురించి ప్రస్తావించడం మర్చిపోయారు.
అప్పుడు ఈ విషయాన్ని గ్రహించలేదు కానీ తర్వాత ఆ విషయాన్ని గ్రహించారు. దీంతో రామ్ ట్విటర్ వేదికగా లింగుస్వామికి క్షమాపణలు చెప్పారు. "ఈ సినిమా తెరకెక్కడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను. నా వారియర్, డైరెక్టర్ లింగుస్వామి, ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌ని మీ భుజాలపైకి ఎత్తుకున్నారు. ఇప్పటివరకూ నేను పనిచేసిన ఉత్తమమైన దర్శకుల్లో మీరూ ఒక్కరిగా ఉన్నందుకు ధన్యవాదాలు. సారీ అండ్ లవ్ యూ" అని రామ్ పేర్కొన్నారు.
రామ్ పెట్టిన ట్వీట్ కు లింగుస్వామి స్పందించారు. "నాతో కలిసి పని చేయడాన్ని నువ్వు ఎంతలా ఇష్ట పడ్డావో నాకు తెలుసన్న ఆయన సినిమా చూసిన అనంతరం ఆత్మీయంగా నువ్వు నన్ను ఆలింగనం చేసుకున్నావు కదా.. ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. మనం మరింత దూరం ప్రయాణించాలని కోరుకుంటున్నా అంటూ ఆయన బదులిచ్చారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇక ఈ సినిమా విశాఖ హక్కులు రామ్ దక్కించుకున్నారని తెలుస్తోంది.
Also Read: Vishwak Sen -Arjun Movie: పవన్ సపోర్ట్..భుజం తట్టి నేనున్నానంటూ!
Also Read:Pushpa The Rule: శ్రీవల్లిని చంపేస్తారా అంటే.. అసలు విషయం చెప్పేసిన నిర్మాత?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook