Ram Gopal Varma Visits YCP MLA Dwarampudi House: వాస్తవానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక పక్క ప్రత్యక్షంగా మరో పక్క పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మను వినడు లేని విధంగా తన సొంత ప్రాంతమైన ఆంధ్రకు వెళ్లారు.
అది కూడా కోడిపందాలలో పాల్గొనేందుకు ఆయన వచ్చారని తెలుసుకున్న పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ మీద కావాలని వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ జనసేన అభిమానులు ఆయనను అడ్డగించే అవకాశం ఉందని భావించి ఆయనను తిరిగి వెళ్ళిపోవాలని సూచిస్తే తన మిత్రుల ఆహ్వానం మీద తాను కోడిపందాలలో పాల్గొనడానికి వచ్చానని వెనక్కి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని వర్మ తేల్చి చెప్పాడు. అయితే కాకినాడలో కోడిపందేల బరుల్లో కలియతిరిగిన ఆయన నిన్న ఉదయం వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరో కాదు గతంలో పవన్ కళ్యాణ్ మీద బూతులతో విరుచుకుపడిన కాకినాడ ఎమ్మెల్యే. అసభ్యకరంగా పవన్ కళ్యాణ్ ను సంబోధిస్తూ 2020లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బూతులను ఖండిస్తూ ఆయన నివాసం వద్దకు జనసేన కార్యకర్తలు వెళ్లి ఆందోళనకు దిగితే అప్పట్లో ఆయన నివాసం వద్ద ఉన్న వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు మధ్య పెద్ద గొడవే జరిగి రాళ్లు, కర్రలతో కూడా దాడి చేసుకున్నారు.
ఆ తర్వాత ఈ విషయాన్ని అటు పవన్ కళ్యాణ్ ఇటు ద్వారంపూడి ఇద్దరూ సీరియస్గా తీసుకున్నారు. పవన్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా ఆయన మీద తాను కూడా పోటీ చేసి ఓడిస్తానని ద్వారంపూడి సవాల్ విసిరారు. తర్వాత ఈ విషయం కాస్త సద్దుమణిగింది. అయితే అలా పవన్ కళ్యాణ్ మీద బూతులు తిట్టిన ఎమ్మెల్యే ఇంటికి రాంగోపాల్ వర్మ వెళ్లడమే కాకుండా ఆయన ఇంట్లో గులాబ్ జామ్ కూడా తింటున్నాను అని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మెగా ఫ్యాన్స్ కి మరింత మండిస్తోంది. వారంతా రాంగోపాల్ వర్మ మీద విరుచుకు పడుతున్నారు.
Having Gulab Jam with the sweet family of Honourable MLA @Dwarampudi4u gaaru at his residence 💐💐💐 pic.twitter.com/c7WMFAgfG5
— Ram Gopal Varma (@RGVzoomin) January 16, 2023
Also Read: YCP MLA Biyyapu: వాల్తేరు వీరయ్య థియేటర్ బుక్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే.. అందరికీ ఫ్రీ షో!