HanuMan-Adipurush: ఆదిపురుష్ తో పోలిస్తే హనుమాన్ చీప్ సినిమా.. దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్

Jai HanuMan: ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ప్రభాస్ ఆది పురుష్ సినిమా డిజాస్టర్ గా నిలవగా తక్కువ అంచనాలతో వచ్చిన తేజ సజ్జ హనుమాన్ చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో కాంట్రవర్సీ డైరెక్టర్ చేసిన కాంట్రవర్సీ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 17, 2024, 03:37 PM IST
HanuMan-Adipurush: ఆదిపురుష్ తో పోలిస్తే హనుమాన్ చీప్ సినిమా.. దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు సినిమాల వల్ల న్యూస్ లో నిలిచిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం మాత్రం ఎప్పుడూ వివాదాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు.

ఈ దర్శకులు తీసిన సినిమాలు ఏవి ప్రస్తుతం విజయం సాధించకపోవడంతో ఏదో ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ చేస్తూ తరచు మీడియా అటెన్షన్ తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ మధ్య తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన హనుమాన్ సినిమా గురించి రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌట్ దర్శకత్వంలో వచ్చిన ఆది పురుష్ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. మరోపక్క ఎన్నో తక్కువ అంచనాలతో వచ్చిన హనుమాన్ సినిమా మాత్రం పాన్ ఇండియాపరంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. తక్కువ బడ్జెట్ తో వచ్చే ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకునింది ఈ చిత్రం.

ఈ క్రమంలో ఈ రెండు సినిమాలను పోలిస్తూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు వచ్చాయి. ఇప్పుడు ఈ రెండు చిత్రాలను పోలీసు రాంగోపాల్ వర్మ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. “ప్రభాస్ ఆదిపురుష్ స్పెషల్ ఎఫెక్ట్స్‌- హనుమాన్ స్పెషల్ ఎఫెక్ట్స్‌ను కంపేర్ చేస్తే.. మనకు కొన్ని విషయాలు చాలా క్లియర్గా అర్థం అయిపోతాయి. ఆదిపురుష్ స్పెషల్ ఎఫెక్ట్స్‌ను పెద్ద పెద్ద ఫారెన్ కంపెనీల దగ్గర ఎంతో ఖర్చు పెట్టి చేయొచ్చాడు. వాటికి ఎన్ని వందల కోట్లు అయిందో దేవుడికే తెలియాలి. కానీ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఆ సినిమా గ్రాఫిక్స్‌ను ఏదో కరీంనగర్ టౌన్‌లోనో ఎక్కడో చేయించాడు. అసలు ఇటువంటి చిత్రానికి  గ్రాఫిక్స్ లోకల్ వాళ్లతో చేయించావేంటి అని నేను అడిగితే బుర్ర తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. సార్ ఎక్కడ చేసినా ఒక రూమ్‌లోనే కదా ఈ వర్క్ చేయాలి. అది ఆస్ట్రేలియా అయితే ఏమిటి ఇక్కడ కరీంనగర్ అయితే ఏంటి అని సింపుల్‌గా ఆన్సర్ ఇచ్చాడు. నిజమే కదా.. వర్క్ ఎక్కడ చేస్తే ఏంటి.. దాని రిజల్ట్ కదా సినిమాకి ముఖ్యం." అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

ఆ తరువాత ఈ రెండు సినిమాల బడ్జెట్ ని కంపేర్ చేసి మాట్లాడుతూ"హనుమాన్ సినిమాను చాలా తక్కువ ఖర్చుతో దర్శకుడు ప్రశాంత్ వర్మ తీశాడు. కానీ మేము తక్కువ బడ్జెట్‌తో తీశాం అనగానే చాలా మంది ఇది చీప్ సినిమా అనుకుంటారు. ఉదాహరణకి ఆదిపురుష్ బడ్జెట్‌తో పోలిస్తే హనుమాన్ తప్పకుండా చీప్ సినిమానే
. అయితే చిత్ర ఫలితం ఏంటో అందరికీ తెలుసు. ప్రస్తుతం వందల కోట్లు పెట్టి సినిమా తీశామని చెబితేనే అది మంచి సినిమా అనుకుంటారు. కానీ తక్కువ ఖర్చుతో కూడా ఇలాంటి అద్భుతమైన సినిమాలను  తీయొచ్చని ప్రశాంత్ వర్మ నిరూపించాడు" అంటూ రాంగోపాల్ వర్మ ఈ రెండు సినిమాలను పోలుస్తూ తన స్టైల్ లో వ్యాఖ్యలు చేశారు.

Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..

Read More: Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.. దీని వెనుక ఉన్న ఈ విశేషం మీకు తెలుసా..?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News