Ram Gopal Varma Vyuham: పవన్ మూడు పెళ్లిళ్లు అసలు మ్యాటరే కాదు.. వర్మ ప్లాన్ అది కాదట?

Ram Gopal Varma Vyuham: రామ్ గోపాల్ వర్మ చేస్తున్నానని ప్రకటించిన వ్యూహం సినిమాతో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం నిజం కాదని అంటున్నారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 28, 2022, 07:34 AM IST
Ram Gopal Varma Vyuham: పవన్ మూడు పెళ్లిళ్లు అసలు మ్యాటరే కాదు.. వర్మ ప్లాన్ అది కాదట?

Ram Gopal Varma is not Targetting Pawan Kalyan with Vyuham: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2019 ఎన్నికల ముందు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అధికారంలోకి రావడానికి గాను కొన్ని ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దానికి కారణం లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు అండ్ కో లక్ష్మీ పార్వతిని కావాలని తప్పుగా చిత్రీకరించి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారనే ఎపిసోడ్ ప్రధానంగా సినిమా చేసి చూపించడమే. ఆ తర్వాత కూడా ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇది అంటూ మరో సినిమా కూడా చేశారు.

దానికి పీకే అని పేరు పెట్టారు. కొద్ది రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు, అనంతరం రామ్ గోపాల్ వర్మ నుంచి ఒక మూవీ ప్రకటన వచ్చింది. తాను అతి త్వరలో వ్యూహం అనే ఒక రాజకీయ సినిమా తీయబోతున్నానని ఇది బయోపిక్ కాదు కానీ బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని చెప్పుకొచ్చారు. బయోపిక్ లో అయినా అబద్ధాలు ఉండొచ్చు కానీ రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయని అహంకారానికి ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన వ్యూహం కధ రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని రాజకురపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతీకాష్ట ఈ వ్యూహం చిత్రం అని పేర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ.

ఈ సినిమా రెండు పార్ట్ లుగా రాబోతోంది మొదటి పార్ట్ వ్యూహం రెండవ పార్ట్ శపథం ఈ రెండింటిలోనూ రాజకీయ అరాచకీయాలు పుష్కలంగా ఉంటాయి, రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం వ్యూహం షాక్ నుంచి చేరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలక్ట్రిక్ షాక్ శపధంలో తగులుతుందని అన్నారు. ఈ వ్యూహం చిత్ర నిర్మాత నాతో అంతకుముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్, ఎలక్షన్ టార్గెట్గా ఈ సినిమా చేయట్లేదు అని చెప్తే ఎవరూ నమ్మరు కనుక ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనుక చెప్పట్లేదు అంటూ తనదైన శైలిలో తికమక పెడుతూ ఒక ప్రకటన చేశారు రామ్ గోపాల్ వర్మ.  

అయితే గత కొద్దిరోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం -పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లని ప్రధాన కథాంశంగా తీసుకుని సినిమా చేయబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. కానీ అందులో ఏ మాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది. వర్మ తీయబోయే పొలిటికల్ మూవీ పవన్ కళ్యాణ్ మీద కాదని పవన్ కళ్యాణ్ కు ఈ సినిమాకు అసలు సంబంధమే ఉండదని అంటున్నారు. ఇది వేరే కథ అని కూడా ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఒక విషయాన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.

దుష్ట చతుష్టయము అంటూ కొన్ని పత్రికలను అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. బహుశా వీరే ప్రధాన కథాంశంగా ఈ సినిమా తెరకెక్కించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక రెండవ పార్ట్ గా చెబుతున్న సినిమాకు శపధం అనే సినిమా టైటిల్ పెట్టడం కూడా చంద్రబాబు గతంలో అసెంబ్లీకి రానంటూ చేసిన శపధం గురించి అయి ఉండవచ్చు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది కాలమే నిర్ణయించాలి.
Also Read: Kalpika Ganesh Pics: కల్పిక గణేష్ హాట్ ఫొటోస్.. తెలుగమ్మాయిని ఇలా ఎప్పుడూ చూసుండరు!

Also Read: Actor Ali: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారుడిగా అలీ నియామకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News