Ram Charan Good Morning America Show : ఇదీ రామ్ చరణ్‌ రేంజ్.. ఆ హాలీవుడ్ స్టార్ల తరువాత మనోడే.. అమెరికాలో మెగా పవర్

Ram Charan Good Morning America Show రామ్ చరణ్‌ ప్రస్తుతం హాలీవుడ్ అడ్డాలో తిరిగేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ మెటీరియల్ అయిన రామ్ చరణ్‌ ఇప్పుడు అక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్‌ అక్కడికి చెప్పులు లేకుండా వెళ్లిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2023, 01:26 PM IST
  • అమెరికాలో రామ్ చరణ్‌ సందడి
  • హాలీవుడ్ అడ్డాలో మెగా పవర్ స్టార్
  • గుడ్ మార్నింగ్ అమెరికా షోలో చెర్రీ
Ram Charan Good Morning America Show : ఇదీ రామ్ చరణ్‌ రేంజ్.. ఆ హాలీవుడ్ స్టార్ల తరువాత మనోడే.. అమెరికాలో మెగా పవర్

Ram Charan Good Morning America Show మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం ఇంటర్నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోన్నాడు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు లాస్ ఏంజిల్స్ వెళ్లాడు. హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ ఇచ్చే అవార్డుల వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ మరో రేర్ ఫీట్‌ను అందుకున్నాడు. అమెరికాలో ఎంతో ఫేమస్ అయిన షోకు గెస్టుగా వెళ్లాడు. గుడ్ మార్నింగ్ అమెరికా అనే షోలో రామ్ చరణ్‌ సందడి చేస్తున్నాడు. 

ఇంత వరకు ఈ షోకు మన ఇండియా నుంచి ఏ హీరో కూడా వెళ్లలేదు. టామ్ క్రూజ్, లియోనార్డ్ డికాప్రియో వంటి హీరోలు వెళ్లిన ఈ షోకు ఇప్పుడు మన రామ్ చరణ్‌ వెళ్లాడు. అది మెగా పవర్ స్టార్ అంటే.. రామ్ చరణ్ రేంజ్ ఇదే అంటూ మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు రామ్ చరణ్ పేరు ట్రెండ్ అవుతోంది.

రామ్ చరణ్‌ ఇప్పుడు అయ్యప్ప మాలలో ఉన్నాడు. అందుకే అన్ని చోట్లకు కాలికి చెప్పులు లేకుండానే వెళ్తున్నాడు. మొన్న ఎయిర్ పోర్టులోనూ అలానే కనిపించాడు. అంతకు ముందు ఈ రేసింగ్‌కు వెళ్లినప్పుడు కూడా కాలికి చెప్పులు లేకుండానే వెళ్లాడు. మన ధర్మం, మన ఆచారం, సంస్కృతిని హాలీవుడ్‌కు సైతం చాటి చెప్పేలా ఇప్పుడు అక్కడ కూడా అయ్యప్ప దీక్షలోనే వెళ్లాడు. అక్కడ కూడా కాలికి చెప్పులు లేకుండానే వెళ్తున్నాడు.

 

అయ్యప్ప దీక్షలో ఉన్నా కూడా రామ్ చరణ్‌ తన సినిమా షూటింగ్‌లను పూర్తి చేస్తూనే ఉన్నాడు. మొన్నటి వరకు శంకర్ సినిమా షూటింగ్‌తో రామ్ చరణ్‌ బిజీగా ఉన్నాడు. చార్మినార్, కొండారెడ్డి బుర్జు, వైజాగ్ ఏరియాలో రామ్ చరణ్‌ షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్‌ ఈ సినిమా తరువాత బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేయనున్నాడు. కన్నడ డైరెక్టర్ నార్తన్‌తోనూ ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Also Read:  Rashmi on amberpet stray dog : కుక్కల దాడిలో పసిబిడ్డ మృతి.. కనికరం చూపించకుండా వాటికే యాంకర్ రష్మీ సపోర్ట్

Also Read: Prabhu Hospitalized : హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ నటుడు ప్రభు.. కారణం ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News