Ram Charan Crucial Comments on Remake:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో సినిమా కలెక్షన్స్ ప్రకటించడం కరెక్ట్ కాదని తాను హీరోగా నటిస్తే ఆ సినిమా నిర్మాతను అలా కలెక్షన్స్ ప్రకటించవద్దని కోరుతానని అదే విధంగా తన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమాలు కలెక్షన్స్ కూడా ప్రకటించాలని పేర్కొన్నారు. అయితే ఆ మాట తప్పి ఆయన తండ్రి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్స్ విషయంలో అనేక ప్రకటనలు కొణిదల ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చాయి.
అంతేకాక ఆ సినిమా 100 కోట్ల రూపాయల దాకా కలెక్ట్ చేస్తే దాన్ని 150 కోట్ల దాకా పెంచి బయటకు ప్రచారం చేశారనే అపవాదు ఉంది. వాస్తవానికి గాడ్ ఫాదర్ సినిమా బాగానే ఉంది కానీ కలెక్షన్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో రాలేదు. అయితే ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారని ప్రేక్షకులకు చెప్పుకునేందుకు ఇలా ఆ కలెక్షన్లు పెంచి ప్రచారం చేశారు అన్న ప్రచారం అయితే ఉంది. ఆ అపవాదులు నిజం చేస్తూ రాంచరణ్ మరోసారి అదేవిధంగా వ్యాఖ్యలు చేశారు.
రామ్ చరణ్ తాజాగా ఢిల్లీకి చెందిన హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ ఈ సినిమా 145 నుంచి 150 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పుకొచ్చారు, దీంతో ఆయన మాట తప్పారు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు, రీమేక్ సినిమాల విషయం గురించి ఆయన మాట్లాడుతూ ఆల్రెడీ ఓటీటీలో ఉన్న సినిమాని రీమేక్ చేయడం కరెక్ట్ కాదని ఎందుకంటే ఆల్రెడీ వారంతా ఓటీటీలో సినిమా చూసి ఉంటారు కాబట్టి థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపించరని అన్నారు.
ఒకవేళ ఆ స్టార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఉన్న పవర్ ను బట్టి లేకపోతే ఆయనకున్న ఫాలోయింగ్ ని బట్టి కొంతవరకు థియేటర్లకి రావచ్చు కానీ పూర్తిస్థాయిలో అయితే ఆ సినిమా వర్కౌట్ అవ్వదు అని చెప్పుకొచ్చారు. పర్సనల్గా అయితే తాను ఓటీటీలో లేని సినిమాలు రీమేక్ చేయడానికి అయితే ఆసక్తి చూపిస్తానని అని చెప్పుకొచ్చారు. నేను ఒకవేళ రీమేక్ చేయాలి అంటే ఆ ఒరిజినల్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయనను దాన్ని ఓటీటీలో రిలీజ్ చేయవద్దని అడుగుతానని ఆయన ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే నేను రీమేక్ చేస్తానని అన్నారు. రీమేక్స్ విషయంలో చరణ్ అభిప్రాయం కరెక్టే కానీ ఈ నెంబర్లు పెంచి చెప్పడం విషయం ఏ మాత్రం బాలేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏమిటో కూడా కామెంట్ చేయండి
Also Read: Kantara Crosses Saaho: ప్రభాస్ సాహూను వెనక్కు నెట్టిన రిషబ్,, టాప్ 8లో కాంతార ఎంట్రీ
Also Read: వింత ప్రేమ.. నలుగురు ముసలోళ్లతో ‘ఆంటీ’ లవ్.. ఐదో వ్యక్తి ఎంట్రీతో సంచలనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook