Video: రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో ఎన్టీఆర్, రాజమౌళి... ఎంతలా ఎంజాయ్ చేశారో చూడండి

Ram Charan Birthday: ఇవాళ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. ఆర్ఆర్ఆర్ హిట్‌తో జోష్ మీదున్న చరణ్.. ఎన్టీఆర్, రాజమౌళితో కలిసి తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2022, 09:57 PM IST
  • రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్
  • ఎన్టీఆర్, రాజమౌళితో కలిసి బర్త్ డే వేడుకలు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
 Video: రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో ఎన్టీఆర్, రాజమౌళి... ఎంతలా ఎంజాయ్ చేశారో చూడండి

Ram Charan Birthday: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో ఎన్టీఆర్, రాజమౌళి సందడి చేశారు. అసలే ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్‌ ఇచ్చిన జోష్.. దానికి తోడు చెర్రీ బర్త్ డే కావడంతో.. ఈ ముగ్గురు కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. రామ్ చరణ్‌తో పాటు ఆయన సతీమణి ఉపాసన, రాజమౌళి, ఎన్టీఆర్, ఆయన సతీమణి ప్రణతి కలిసి చెర్రీ బర్త్ డే కేక్‌ని కట్ చేశారు. అనంతరం చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ఒకరినొకరు గట్టిగా అలుముకుని సంబరాల్లో మునిగిపోయారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చరణ్ నివాసంలో ఈ బర్త్ డే వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది.

బర్త్ డే వేడుకల్లో చరణ్ మాట్లాడుతూ... 'తారక్ ఎంతో ధైర్యం చేసి మరీ భార్యను వదిలి ఎన్నో సంవత్సరాలుగా నా పుట్టినరోజు వేడుకలకు వస్తున్నాడు..' అని కామెంట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ సహా అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు. తారక్ భార్య ప్రణతి పుట్టినరోజు మార్చి 26 కాగా, చరణ్ పుట్టినరోజు మార్చి 27. ప్రతీ ఏడాది మార్చి 26 రాత్రి ప్రణతి పుట్టినరోజు వేడుకలు అయిపోయిన వెంటనే తారక్ చరణ్ దగ్గరికి వెళ్తుంటాడు. ఈ విషయాన్ని తారక్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చరణ్ తాజాగా ఫన్నీ కామెంట్స్ చేశారు. 

కాగా, ఆర్ఆర్ఆర్‌ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. విడుదలైన అన్నిచోట్ల ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇద్దరు చారిత్రక పురుషుల పాత్రలకు ఫిక్షన్ జోడించి తీసిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఎన్టీఆర్, చరణ్‌ల నటన అద్భుతమంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా కొమురంభీముడో సాంగ్‌లో ఎన్టీఆర్ పలికించిన హావభావాలకు ప్రేక్షకులు కంటతడి పెడుతున్నారంటే అతిశయోక్తి కాదు. థియేటర్‌లో కొమురంభీముడో సాంగ్ చూస్తూ ఓ మహిళ కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తొలిరోజు నుంచే రికార్డుల  వేట మొదలుపెట్టిన ఈ సినిమా లాంగ్ రన్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ అవకాశం ఉంది. 

Also Read: Video: రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో ఎన్టీఆర్, రాజమౌళి.. ఎంతలా ఎంజాయ్ చేశారో చూడండి

Also read: Pooja Hegde: టైట్‌ఫిట్ అథ్లెటిక్ డ్రెస్‌తో మెరుస్తున్న రాధేశ్యామ్ హీరోయిన్ పూజా హెగ్డే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News