Rakul Preet Singh New Dish: రకుల్ ప్రీత్ కొత్త వంటకం, తప్పించుకున్న నటి సోదరుడు

Rakul Preet Singh New Dish : కొందరు కొత్త రకం వంటకాలు కనిపెట్టినా, యూట్యూబ్ వీడియోలు చూసి రుచికరమైన ఐటమ్స్ చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. తాజాగా టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కొత్త వంటకం వైరల్ అవుతోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 10, 2021, 12:24 PM IST
Rakul Preet Singh New Dish: రకుల్ ప్రీత్ కొత్త వంటకం, తప్పించుకున్న నటి సోదరుడు

Rakul Preet Singh New Dish: గతేడాది లాక్‌డౌన్ సమయంలో ఎందరో సెలబ్రిటీలు గరిటెతిప్పారు. అప్పటివరకూ వంటగదిలో కాలుపెట్టని వారు సైతం తమ వంతు ప్రయత్నం చేయడానికి కష్టపడ్డారు. కొందరు కొత్త రకం వంటకాలు కనిపెట్టినా, యూట్యూబ్ వీడియోలు చూసి రుచికరమైన ఐటమ్స్ చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

తాజాగా టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఓ వంటకాన్ని తయారుచేయాలని భావించింది. కిచెన్‌లో అడుగుపెట్టి చేసిన వంటకాన్ని రకుల్ ఆఫర్ చేయగా ఆమె తమ్ముడు అమన్ నో చెప్పాడు. దీదీ ఇది ఏం వంటకం, ఏం తయారుచేశావు అని అడిగాడు. నల్లగా మారిన పదార్థాన్ని గిన్నెలోకి తీస్తున్న టాలీవుడ్ భామ రకుల్‌ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ప్యాన్‌కేక్ అని చెప్పింది. దీన్ని ఫ్రీజ్‌లో కాసేపు ఉంచి తినాలని రకుల్ తన సోదరుడికి చెప్పగా నాకు మాత్రం వద్దు, థ్యాంక్ గాడ్ అని బదులిచ్చాడు.

Also Read: Dos And Donts Of Solar Eclipse 2021: సూర్య గ్రహణం సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి జోలికి అసలు వెళ్లరాదు

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aman (@aman01offl)

ప్యాన్‌కేక్ తయారుచేయాలనుకుంటే ఇది ఇలా తయారైంది. కానీ నూనె ఎక్కువ వేయడంతో ఇలా మారిపోయింది అంటూ రకుల్ నవ్వుతూ చెప్పింది. రకుల్ సోదరుడు అమన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సోదరి రకుల్ చేసిన కొత్త వంటకం వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో (Viral Video)ను రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసుకుంటూ, చాలా రుచిగా ఉందని క్యాప్షన్ ఇవ్వడం గమనార్హం. 

Also Read: Yami Gautam Wedding Photos: టాలీవుడ్ నటి యామీ గౌతం పెళ్లి ఫొటోస్ గ్యాలరీ

కెరీర్ విషయానికొస్తే నటి రకుల్ ప్రీత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఫ్యామిలీ కామెడీ ‘సర్దార్ కా గ్రాండ్‌సన్’లో కనిపించింది. ఇందులో బాలీవుడ్ నటీనటులు నీనా గుప్తా, అర్జున్ కపూర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్‌తో కలిసి మేడే లో కనిపించనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News