Anubhavinchu Raja: జల్సా రాయుడిగా 'రాజ్ తరుణ్'...ఆకట్టుకుంటున్న 'అనుభవించు రాజా' టీజర్

Anubhavinchu Raja Teaser: యువ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం 'అనుభవించు రాజా'. ఈ సినిమా టీజర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 23, 2021, 12:06 PM IST
  • 'అనుభవించు రాజా' టీజర్ రిలీజ్
  • రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల
  • నవ్వులు పూయిస్తున్న రాజ్ తరుణ్
Anubhavinchu Raja: జల్సా రాయుడిగా 'రాజ్ తరుణ్'...ఆకట్టుకుంటున్న 'అనుభవించు రాజా' టీజర్

Anubhavinchu Raja Teaser: 'ఉయ్యాలా జంపాలా' చిత్రంతో వెండితెరకు పరిచయమైన హీరో రాజ్ తరుణ్(Raj Tarun). మెుదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో..తరువాత వరుస ఆఫర్లతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన యాసతో ప్రేక్షకులు హృదయాల్లో చెరగని ముద్రవేశాడు ఈ వైజాగ్ కుర్రాడు. 

తాజాగా రాజ్ తరుణ్ నటిస్తున్న చిత్రం 'అనుభవించు రాజా'(Anubhavinchu Raja). శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గ్రామీణ కథాంశం నేపథ్యంలో వినోదం ప్రధానాంశంగా తీసుకొని ఈ మూవీ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న యూనిట్.. తాజాగా చిత్ర టీజర్(Teaser) రిలీజ్ చేశారు.

Also Read: Bala krishna: 'లైగర్‌' సెట్‌లో లయన్.. ఫోటోలు వైరల్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఈ టీజర్ రిలీజ్ చేస్తూ.. వీడియో చాలా ఫన్నీగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్‌ మొత్తానికి బెస్ట్ విషెష్ చెబుతూ 'అనుభవించు రాజా' టీజర్‌ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఒక నిమిషం రెండు సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌‌లో జల్సా రాయుడుగా రాజ్ తరుణ్ కనిపించాడు. పేకాట, కోడి పందాల నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. పక్కా గోదావరి స్లాంగ్‌లో రాజ్ తరుణ్ చెప్పిన డైలాగ్స్, ఆయన గెటప్ సినిమాలో ఏదో కొత్తదనం చూపిస్తున్నారనే ఫీలింగ్స్ తెప్పిస్తోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News