Pushpa Review: పుష్పరాజ్ యాక్టింగ్ తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్​- సినిమా ఎలా ఉందంటే..

Pushpa Review: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ నటించిన 'పుష్ప ది రైజ్​' థియేటర్లలో విడుదలైంది. 'తగ్గేదే లే' అంటూ బెనిఫిట్ షో నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్​ సందడి చేశారు. మరి సినిమా ఎలా ఉంది? అల్లు అర్జున్ సహా ఇతర నటీ, నటులు ఎలా చేశారు? తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2021, 02:29 PM IST
  • ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు పుష్ప సినిమా
  • బెనిఫిట్​ షోకే థియేటర్ల వద్ద అభిమానుల సందడి
  • అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్​
Pushpa Review: పుష్పరాజ్ యాక్టింగ్ తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్​- సినిమా ఎలా ఉందంటే..

Pushpa Review: కరోనా కారణంగా చాలా రోజుల తర్వాత ఐకాన్ ​స్టార్​ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన..​ సినిమా థియేటర్లలో విడుదలైంది. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' నేడు (డిసెంబర్ 17 శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా (Pushpa: The Rise) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో పాటు భారీ తారాగణం, స్టోరీపై సినిమా యూనిట్ ఇచ్చిన హైప్​ కారణంగా.. అంచనాలు ఓ లెవల్లో ఉన్నాయి. మరి పుష్ప ఆ అంచనాలను అందుకుందా? ఇప్పటికే సినిమా చూసిన వాళ్లు ఏం చెబుతున్నారు? ట్విట్టర్ సహా సోషల్​ మీడియా పోస్ట్​ల ఆధారంగా రివ్యూ ఇప్పుడు చూద్దాం.

పుష్ప గురించి..

ఈ సినిమాలో అల్లు అర్జున్​కు జోడీగా రష్మిక మందాన (Rashmika Mandanna) హీరోయిన్​గా నటించారు. మలయాళి నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil)​ ప్రతినాయకుడి పాత్ర చేశారు. సునీల్​, అనసూయ భరద్వాజ్​లు కీలక పాత్రలు పోషించారు. ప్రకాశ్​ రాజ్​, జగపతి బాబు, వెన్నెల కిశోర్​లు కూడా ఈ సినిమాలో నటించారు. సమంత ఓ ఐటం సాంగ్​ చేశారు.

ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా, దేవిశ్రీ ప్రసాద్​ సంగీతమందించారు. ఈ సినిమా పాటలు ఇప్పటికే ఓ ఊపు ఊపేశాయి. నవీన్ ఎరనేని. వై. రవి శంకర్​ నిర్మాతలుగా ఉన్నారు.

పాన్​ ఇండియా సినిమా..

దీనిని పాన్​ ఇండియా సినిమాగా తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో తెలుగుతోపాటు.. ఈ రోజే తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదలైంది.

సినిమాపై ట్విట్టర్​ టాక్​...

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్​గా కనిపించారు. ఫహాద్ ఫాజిల్​ భన్వర్​సింగ్ శెఖావత్​గా నటించారు. సినిమాలో ఎక్కువ భాగం అడవుల్లోనే ఉంటుంది. అల్లు అర్జున్ సహా దాదాపు అన్ని క్యారెక్టర్లు ఈ సినిమాలో డీ గ్లామరెస్​గా కనిపిస్తాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే.. పుష్ప ఔట్ స్టాండిగ్​ అంటూ బెనిఫిట్ షో చూసిన ప్రేక్షకులు (Pushpa Twitter Review) చెబుతున్నారు. అల్లు అర్జున్​ (Allu Arjun) చేసిన సినిమాలన్నింటితో పోలిస్తే.. ఇందులో నటన మరో స్థాయిలో ఉందంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. మొదటి భాగం భలే ముగించారని.. పుష్ప పార్ట్​-2 కోసం వెయిటింగ్ అంటున్నారు.

ఎవరెవరు ఎలా చేశారు?

ఈ సినిమాలో అందరూ యాక్టింగ్ చాలా బాగా చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమా హాలీవుడ్ లెవెల్లో ఉందని చెబుతున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయని చెబుతున్నారు. అల్లు అర్జున్​ వన్​ మ్యాన్ షో అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు.

అయితే.. అక్కడక్కడ కొంత మంది డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది. మొదటి భాగం కన్నా సెకండాఫ్​ బాగుందంటూ చెబుతున్నారు. మరో బాహుబలి కాకపోయినప్పటికీ.. సినిమా బాగుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద బాక్సాఫీస్​ వద్ద హిట్టుకొడుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.

Also read: Pushpa First Review: అల్లు అర్జున్ పుష్ప సినిమా అదుర్స్.. బెస్ట్ టాలీవుడ్ 2021 సినిమా అంటున్న రివ్యూ

Also read: Rashmika Mandanna viral pics: రష్మిక మందన ఆ ఫోటోలు వైరల్.. తల పట్టుకున్న శ్రీవల్లి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News