Dakko Dakko Meka Video Song: 'పుష్ప' నుంచి బన్నీ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'దాక్కో దాక్కో మేక' వీడియో సాంగ్ వచ్చేసింది!

Dakko Dakko Meka Full Video Song: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన మూవీ 'పుష్ప ది రైజ్'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరిస్తుంది. ఈ నేపథ్యంలో 'దాక్కో దాక్కో మేక' ఫుల్ వీడియో సాంగ్ ను గురువారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 11:08 AM IST
Dakko Dakko Meka Video Song: 'పుష్ప' నుంచి బన్నీ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'దాక్కో దాక్కో మేక' వీడియో సాంగ్ వచ్చేసింది!

Dakko Dakko Meka Video Song: ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) నటించిన 'పుష్ప'.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఐదు భారతీయ భాషల్లో డిసెంబర్​ 17న విడుదలైన ఈ సినిమా ఓవర్సీస్​లోనూ జోరు చూపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా అల్లు అర్జున్ 'పుష్ప' నిలిచింది. ఈ క్రమంలో చిత్ర విజయోత్సవ వేడుకలను చిత్రబృందం ఇటీవలే గ్రాండ్ గా నిర్వహించింది. 

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందిన 'పుష్ప' సినిమా డిసెంబరు 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై విశేష స్పందన తెచ్చుకుంది. అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాడు 'పుష్ప'రాజ్. ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా చిత్ర విజయోత్సవ వేడుకలను చిత్రబృందం ఇటీవలే నిర్వహించింది. 

ఇటీవలే థియేటర్లలో విడుదలైన హిందీ చిత్రాల కంటే అల్లు అర్జున్ 'పుష్ప' అత్యధికంగా కలెక్షన్లు సాధించడం పట్ల మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ లోనూ తెలుగు సినిమా సత్తా మరోసారి చాటినట్లైంది. అయితే థియేటర్లలో వచ్చిన సందడితో పాటు సోషల్ మీడియాలో మరో సందడి చేసేందుకు పుష్ప మేకర్స్ సిద్ధమయ్యారు. సినిమాలోని తొలి సాంగ్ 'దాక్కో దాక్కో మేక' ఫుల్ వీడియోను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ఈ పాట ఫుల్​ వీడియోను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ రిలీజ్​ చేశారు. 

శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తీసిన 'పుష్ప' సినిమాలో అల్లుఅర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, రావు రమేష్ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీమూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.   

Also Read: Sri Reddy Comments on Samantha: 'ఆమె బట్టలు విప్పినా అక్కడ ఏమి ఉండవు'.. సమంతపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also Read: Krithi Shetty Photos: నీ నవ్వు చాలు బేబమ్మ.. కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేయడానికి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News