Samantha Item Song Pushpa: ‘పుష్ప’ ఐటెం సాంగ్ లో సమంత ఫిక్స్.. త్వరలోనే ఫుల్ సాంగ్ రిలీజ్!

Samantha Item Song Pushpa: అల్లు అర్జున్, రష్మిక జోడీగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డిసెంబరు 17న థియేటర్లలో విడుదల చేయనున్నరు. ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ ను విడుదల చేశారు. ఈ సినిమాలోని ఐటెం సాంగ్ లో స్టార్ హీరోయిన్ సమంత నటించనున్నట్లు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 06:31 PM IST
    • పుష్ప సినిమా నుంచి ఐటెం సాంగ్ అప్డేట్
    • స్పెషల్ సాంగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్, సమంత
    • త్వరలోనే ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన
Samantha Item Song Pushpa: ‘పుష్ప’ ఐటెం సాంగ్ లో సమంత ఫిక్స్.. త్వరలోనే ఫుల్ సాంగ్ రిలీజ్!

Samantha Item Song Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సిరీస్ లోని తొలి భాగాన్ని డిసెంబరు 17న విడుదల చేయనున్నారు. ఇందులో ఐటెం సాంగ్ కు సమంతను ఎంపిక చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోందని వెల్లడించారు. దీనికి సంబంధించిన పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

మరోవైపు ‘పుష్ప’ సినిమా ట్రైలర్ ను డిసెంబరు 6న విడుదల చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ఇటీవలే ప్రకటించింది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబయిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రానున్నారని బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్ కోసం నిర్మాణ సంస్థ జోరు చూపిస్తోంది. ఇప్పటికే అనేక సాంగ్స్, గ్లింప్స్ రిలీజ్ చేయడం సహా వీలున్నప్పుడల్లా సినిమా గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ బాస్ లో ప్రత్యక్షమవనున్నారని సమాచారం. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ హిందీ సీజన్-15 రియాలిటీ షో త్వరలోనే అల్లు అర్జున్ సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ బిగ్ బాస్ షో లలో బన్నీ ఎంట్రీ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సిరీస్ ను సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతకంపై నవీన్ యేర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్, రష్మిక తో పాటు విలన్ గా ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.  

ALso Read: Bheemla Nayak Song Update: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్.. ‘భీమ్లా నాయక్’ నుంచి మరో సాంగ్ అప్డేట్!

Also Read: Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్.. టాస్క్ లో గెలిస్తే డైరెక్ట్ ఫైనల్! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News