Puri Jagannadh Changing Base: అడ్డా మార్చేస్తున్న పూరీ.. అది కలసి రాలేదని ఇప్పుడు ఆ సిటీకి!

Puri Jagannadh Changing his base from Mumbai to Goa: లైగర్ సినిమాతో భారీ దెబ్బ తిన్న పూరీ జగన్నాధ్ ఇప్పుడు తన బేస్ మొత్తాన్ని మార్చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 19, 2022, 04:20 PM IST
Puri Jagannadh Changing Base: అడ్డా మార్చేస్తున్న పూరీ.. అది కలసి రాలేదని ఇప్పుడు ఆ సిటీకి!

Puri Jagannadh Changing his base from Mumbai to Goa: తెలుగులో టాప్ డైరెక్టర్గా ఉన్న పూరి జగన్నాథ్ ఇటీవల లైగర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ మీద చార్మికౌర్, కరణ్ జోహార్ కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అపూర్వ మెహతా ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు.

ఎంతో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచి కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాక సినిమా మీద విమర్శల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా డిజాస్టర్ అవడంతో పూరీ జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న జనగణమన అనే సినిమా పరిస్థితి ఏమిటనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఆ సినిమా ప్రస్తుతానికి హోల్డ్ లో ఉందని కొందరు అంటుంటే లేదు పూర్తిగా నిలిపి వేశారని మరికొందరు అంటున్నారు.

ఇక ముంబైలో సెటిల్ అవుదామని హైదరాబాదు నుంచి తన బేస్ మొత్తాన్ని ముంబైకి మార్చిన పూరీ జగన్నాథ్ సైతం లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడంతో ముంబైలో తీసుకున్న అద్దె ఫ్లాట్ కాళీ చేశారట. నెలకు 15 లక్షల రూపాయలు దానికి అద్దె చెల్లించడం కంటే ఖాళీ చేయడమే నయమని చార్మి అండ్ టీ భావించి ఆ ఫ్లాట్ కాళీ చేశారట. ఇక ప్రస్తుతానికి పూరి జగన్నాథ్ గోవాకి తన బేస్ మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

నిజానికి తన కథలు రాసుకోవడానికి పూరి జగన్నాథ్ ఎప్పుడూ బ్యాంకాక్ వెళుతూ ఉంటారని ప్రచారం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కువగా గోవాలోనే కథలు రాసుకుంటున్నారట. ఇప్పుడు కూడా గోవాలో ఒక మంచి బీచ్ ఫేస్ ఉన్న రెండు బిల్డింగ్స్ ఫైనల్ చేశారని అందులో ఒక దానిలో పూరి జగన్నాథ్ దిగబోతున్నారని టాక్ వినిపిస్తోంది. లైగర్ సినిమాలో నిర్మాణ బాధ్యతలు కూడా పంచుకున్న పూరీ జగన్నాథ్ భారీగా నష్టపోయారని తెలుస్తోంది.

ఇక ఇప్పటికిప్పుడు పూరీ జగన్నాథ్ కథ చెప్పినా అది ఎంత అద్భుతంగా ఉన్నా సినిమా చేయడానికి తెలుగు హీరోలు ఖాళీగా లేరు. ఎవరికివారు రెండు మూడు సినిమాలు అనౌన్స్ చేసి పైప్ లైన్ లో పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పట్లో పూరి జగన్నాథ్ సినిమా చేసే అవకాశం లేదని ఒక ప్రచారం జరుగుతోంది. దీంతో ఇతర హీరోలతో సినిమాలు చేయడం కోసం వెయిట్ చేయడం కంటే తన కుమారుడితో సినిమాలు చేయడం బెటర్ అని ఆయన భావిస్తున్నట్లు ఒక ప్రచారం ఉంది.

అయితే పూరీ జగన్నాథ్ కుమారుడికి ఇప్పటివరకు ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ఒక వేళ కొడుకుతోనే సినిమా చేస్తే డబ్బులు పెట్టేది ఎవరు? అనే వాదన కూడా ఉంది. మరి ఈ విషయంలో పూరి జగన్నాధ్ చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఆయన మరో హీరో కోసం కథ సిద్ధం చేసుకుంటారా? లేక తన కుమారుడితోనే సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తారా అనేది కాలమే నిర్ణయించాలి మరి.

Also Read: Vennela Kishore Un known Facts: అసిస్టెంట్ డైరెక్టర్ కాబోయి స్టార్ యాక్టర్..అమెరికాలో లవ్..రోజుకు ఐదు లక్షలు.. వెన్నెల కిషోర్ గురించి మీకు తెలియని విషయాలివే!

Also Read: Dhanush Sir Movie: సార్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆరోజునే ప్రేక్షకుల ముందుకు ధనుష్ సినిమా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News